జగన్నాటకాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి

ETVBHARAT 2025-02-07

Views 4

TDP State President Palla Srinivasa Rao Comments On YS Jagan : దోపీడీలో భాగస్వాములైనా వైఎస్ జగన్, విజయసాయి రెడ్డిలు కలిసి డ్రామాలాడుతున్నారని, ఇద్దరినీ నమ్మటానికి లేదని తెలుగుదేశం రాష్ట్ర పార్టీ అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు ధ్వజమెత్తారు. జగన్నాటకాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. దారుణాలు, దోపిడీలు, దాడులకు కేరాఫ్ అడ్రస్ జగన్​ మోహన్ రెడ్డి అని మండిపడ్డారు. జగన్ 1.0, 2.0 రెండు కూడా ప్రజాధనం దోపిడీనే ప్రధాన లక్ష్యమని దుయ్యబట్టారు. ప్రజా తీర్పును గౌరవించలేని వాడు ఇక కార్యకర్తలను ఏం గౌరవిస్తాడని నిలదీశారు. జగన్ మళ్లీ అధికారంలోకి రావడం పగటి కలే అని ఎద్దేవా చేశారు. విశ్వసనీయత, నీతి, నిజాయితీల గురించి జగన్ మాట్లాడుతుంటే దెయ్యాలు వేదాలు అల్లినట్లు ఉందని విమర్శించారు.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS