మీ అన్నగా మాట ఇస్తున్నా - మిమ్మల్ని కోటీశ్వరులను చేస్తా : సీఎం రేవంత్ రెడ్డి

ETVBHARAT 2025-03-08

Views 0

CM Revanth On Indira Mahila Shakti Mission : ఆడబిడ్డల ఆశీర్వాదంతో తెలంగాణలో చంద్ర గ్రహణం తొలగిపోయిందని సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా సికింద్రాబాద్‌ పరేడ్‌ మైదానంలో ఏర్పాటు చేసిన మహిళా శక్తి సభలో ముఖ్యమంత్రి ప్రసంగించారు. ఏ మార్పు కావాలని ఆడబిడ్డలు ఆశీర్వదించారో ఆ మార్పు ఇప్పుడు పరేడ్‌ గ్రౌండ్‌లో కనిపిస్తోందని అన్నారు. మహిళలను ఆర్థికంగా బలోపేతం చేస్తేనే రాష్ట్రం 1 ట్రిలియన్‌ ఆర్థిక వ్యవస్థ అవుతుందని కేబినెట్‌ మీటింగ్‌లో నిర్ణయించామని రేవంత్ రెడ్డి వెల్లడించారు. ఆడ బిడ్డలు తలచుకుంటే వన్‌ ట్రిలియన్‌ ఆర్థిక వ్యవస్థ సాధన పెద్ద కష్టం కాదని ఆయన తెలిపారు.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS