బహదూర్‌పల్లిలోని బాబాఖాన్‌ చెరువు సందర్శించిన హైడ్రా కమిషనర్‌

ETVBHARAT 2025-03-13

Views 7

HYDRAA commissioner Dundigal visit : చెరువు నుంచి నీళ్లు దిగువకు సజావుగా వెళ్లేలా చర్యలు చేపట్టాలన్న హైకోర్టు ఆదేశాలతో హైడ్రా కమిషనర్‌ రంగనాథ్‌ క్షేత్రస్థాయిలో పర్యటించారు. దుండిగల్ మున్సిపల్‌పరిధిలోని బహదూర్‌పల్లిలోని బాబాఖాన్ చెరువువద్ద నిర్మించిన గృహసముదాయాన్ని వివిధ శాఖల అధికారులతో కలిసి హైడ్రా కమిషనర్ రంగనాథ్‌ పరిశీలించారు. బాధితులతో మాట్లాడిన ఆయన చెరువు నీటిపారుదలకు అంతా మాట్లాడుకొని సమస్య పరిష్కరించుకోవాలని సూచించారు. సమస్య పరిష్కారం కాకుంటే హైడ్రా నిబంధనలు ప్రకారం కఠిన చర్యలు తీసుకొంటామని రంగనాథ్ చెప్పారు. బాబాఖాన్‌ చెరువు నుంచి అలుగుపారకుండా ప్రైమార్క్‌గృహ సముదాయం నిర్మించారని ఆరోపిస్తూ కొందరు రైతులు హైకోర్టును ఆశ్రయించారు. హైకోర్టు ఆదేశాల నేపథ్యంలో హైడ్రా కమిషనర్ రంగనాథ్ క్షేత్రస్థాయిలో పర్యటించి బాధితులతో మాట్లాడారు.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS