రాష్ట్రంలో సుర్రుమంటున్న సూరీడు - మార్చిలోనే 40 డిగ్రీలు దాటిన ఉష్ణోగ్రతలు - ఆ జిల్లాలకు ఎల్లో అలర్ట్​ జారీ

ETVBHARAT 2025-03-14

Views 1

Temperature Increases in Telangana : రాష్ట్రంలో ఎండలు మండుతున్నాయి. తెలంగాణ వ్యాప్తంగా మార్చి నెలలోనే గరిష్ఠ ఉష్ణోగ్రతలు 40 డిగ్రీలకుపైగా నమోదవుతున్నాయని హైదరాబాద్​ వాతావరణ కేంద్రం తెలిపింది. సాధారణం కన్నా 3.3 డిగ్రీలు అధికంగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయని, ప్రధానంగా ఉత్తర తెలంగాణ జిల్లాల్లో ఎండల తీవ్రత ఎక్కువగా ఉందని ఐఎండీ అధికారి ధర్మరాజు తెలిపారు. రానున్న రెండు రోజుల్లో గరిష్ఠ ఉష్ణోగ్రతలు 42 డిగ్రీలకుపైగా నమోదయ్యే అవకాశం ఉందని ఆయన వివరించారు.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS