పారిశుద్ధ్య కార్మికుడిగా మంత్రి నారా లోకేశ్

ETVBHARAT 2025-03-15

Views 2

MINISTER NARA LOKESH IN MANGALAGIRI: మంగళగిరిలో స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో మంత్రి లోకేశ్ పాల్గొన్నారు. స్థానిక పార్కులో చెత్తను మంత్రి ఊడ్చారు. కార్మికులతో పాటు చీపురు, చెత్తబుట్ట పట్టిన లోకేశ్, వారితో మాట్లాడుతూ ఆయా పరిసరాలను శుభ్రం చేశారు. పారిశుద్ధ్య కార్మికుడు ఎమ్.నాగార్జునతో మంత్రి లోకేశ్​ మమేకమయ్యారు. అతని యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు. ఏ ఊరు, ఎక్కడ పనిచేస్తున్నారని మంత్రి ప్రశ్నించగా. తాను మంగళగిరి 16వ వార్డులో నివాసం ఉంటున్నానని, 15 ఏళ్ల నుంచి పారిశుద్ధ్య కార్మికుడిగా పనిచేస్తున్నాని అతడు తెలిపాడు. ఎంతమంది పిల్లలు, ఎక్కడ చదువుతున్నారని అడగగా తనకు ఇద్దరు పిల్లలు ఉన్నారని, అమ్మాయి పదో తరగతి, అబ్బాయి తొమ్మిదో తరగతి చదువుతున్నారని, ఇద్దరినీ ప్రభుత్వ మున్సిపల్ పాఠశాలలో చదివిస్తున్నానని చెప్పాడు.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS