అబ్బాయిలు కాస్త జాగ్రత్త - ఇక నుంచి రైళ్లలో మహిళా బోగీ ఎక్కితే అంతే సంగతులు

ETVBHARAT 2025-03-26

Views 2

South Central Railway Focus on Women Safety : ప్రయాణికుల భధ్రతకు రైల్వే పెద్ద పీఠ వేస్తుందని, సురక్షిత ప్రయాణం కోసం మరిన్ని భద్రతా చర్యలు తీసుకుంటున్నట్లు దక్షిణ మధ్య రైల్వే జీఎం అరుణ్ కుమార్ జైన్ స్పష్టం చేశారు. ఎస్సీఆర్‌ జనరల్ మేనేజర్ అరుణ్ కుమార్ జైన్ అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. రైళ్లలో ముఖ్యంగా మహిళల కంపార్ట్‌మెంట్లు, ఎం.ఎం.టీ.ఎస్ రైళ్లలో ఎక్కువ మంది మహిళా రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్, ప్రభుత్వ రైల్వే పోలీస్ సిబ్బందిని మోహరించాలని స్పష్టం చేశారు. ముఖ్యంగా అర్థరాత్రి, తెల్లవారుజామున ఆర్.పీ.ఎఫ్, జీఆర్​పీ సిబ్బంది క్రమం తప్పకుండా గస్తీ నిర్వహించాలని అధికారులను ఆదేశించారు. MMTS రైళ్లలో అత్యవసర ఫోన్ నంబర్‌లను ప్రదర్శించాలనీ నిర్ణయించారు. స్టేషన్లలో పబ్లిక్ అడ్రస్ సిస్టమ్ ప్రకటనల ద్వారా క్రమం తప్పకుండా అవగాహన ప్రచారాలను చేపట్టాలని స్పష్టం చేశారు.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS