ఆగిన వాహనాలను ఢీకొట్టిన సిటీ బస్సు- నలుగురు మృతి- వీడియో వైరల్

ETVBHARAT 2025-04-17

Views 17

Rajkot City Bus Accident : హడావుడిగా ఆఫీస్​కు వెళ్తున్నవారు కొందరు. పిల్లలను స్కూల్​లో దింపేందుకు వెళ్తున్నవారు మరికొందరు. పనులకు వెళ్లేవారు ఇంకొందరు. ఇలా బిజీబిజీగా రోడ్డుపై వెళ్తున్నవారిని బస్సు రూపంలో వచ్చిన మృత్యువు బలి తీసుకుంది. సిగ్నల్ వద్ద ఆగి ఉన్న వారిపై ఒక్కసారిగా ఓ సిటీ బస్సు అదుపు తప్పి వచ్చి ఢీ కొట్టింది. దాదాపు 8 వాహనదారులపైకి దూసుకెళ్లింది. ఫలితంగా నలుగురు మరణించగా, మరో నలుగురు గాయపడి చికిత్స పొందుతున్నారు.

ఈ దారుణ ఘటన గుజరాత్​లోని రాజ్​కోట్​ బుధవారం ఉదయం జరిగింది. సుమారు 10 గంటల సమయంలో ఇందిరా సర్కిల్ ట్రాఫిక్ సిగ్నల్ వద్ద గ్రీన్ లైట్​ పడడంతో అందరూ వెళ్తున్నారు. ఈ క్రమంలోనే వెనుక నుంచి వేగంగా వచ్చిన సిటీ బస్సు అదుపు తప్పి ముందుగా వెళ్తున్న వాహనాలపైకి దూసుకెళ్లింది. రెండు కార్లతో పాటు నాలుగు ద్విచక్రవాహనాలను ఢీ కొట్టింది. దీంతో నలుగురు మరణించగా, మరో నాలుగరు గాయపడ్డారు. ప్రస్తుతం వీరంతా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. దీనికి సంబంధించిన ప్రమాద దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్​గా మారాయి.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS