పోలవరం డిజైన్లపై ప్రభుత్వం కీలక నిర్ణయం | Nimmala Ramanaidu Polavaram Key visit | Asianet Telugu

Asianet News Telugu 2025-05-06

Views 4.7K

ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి, పోలవరం ప్రాజెక్ట్ పూర్తికి అవినాభావ సంబంధం ఉందని జ‌ల‌వ‌న‌రుల శాఖ మంత్రి నిమ్మ‌ల రామానాయుడు విదేశీ నిపుణుల బృందానికి చెప్పారు. అలాగే, జాతీయ స్థాయిలో నదుల అనుసంధానానికి పోలవరం ప్రాజెక్టు పూర్తికి విడదీయలేని పరస్పర ఆధార ప్రాజెక్టులుగా అభివర్ణించారు. అందువల్లనే ప్రధాని మోదీ, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పోలవరంపై ప్రత్యేక దృష్టి నిలిపారని మంత్రి వివరించారు.

పోలవరం ప్రాజెక్ట్ పూర్తికి సాంకేతిక సలహాలు ఇవ్వడానికి వచ్చిన విదేశీ నిపుణుల బృందాన్ని మంత్రి నిమ్మల రామానాయుడు కలిశారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణాన్ని యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాల్సిన ఆవశ్యకతను, అవసరాన్ని నిపుణుల బృందానికి తెలియజెప్పారు. ముందు నిర్దేశించుకున్న లక్ష్యం ప్రకారం.. 2027 కల్లా పోలవరం ప్రాజెక్ట్ పూర్తి చేయాల్సి ఉంది. అందువల్ల మీరంతా సహకరించి లక్ష్యాన్ని కంటే ముందుగా పూర్తయ్యేటట్లు ప్రయత్నించాలని కోరారు. అనంతరం ఎగువ కాఫర్ డ్యామ్ బలోపేతం చేసేలా నిర్మిస్తున్న బట్రస్ డ్యామ్, గ్యాప్-2 డి వాల్ పనులను మంత్రి నిమ్మల పరిశీలించారు.

#Polavaram #NimmalaRamanaidu #Chandrababu #GodavariWaters #APPolitics #AsianetNewsTelugu

Stay tuned for the latest Telugu News updates, Celebrity news, and political happenings from Andhra Pradesh, Telangana, and across India.
Stay updated with the latest news at 🌐 https://telugu.asianetnews.com🗞️

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS