బాల్య వివాహాలపై పోరాటం - ప్రజలకు అవగాహన కల్పిస్తున్న బెజవాడ అమ్మాయి

ETVBHARAT 2025-12-06

Views 3

Interview With Social Activist Soujanya From Vijayawada: ప్రస్తుత తరుణంలో బాల్యవివాహాలు పెరిగిపోతున్నాయి. బాల్యవివాహాలనేవి చట్టరీత్యా నేరం, బాల్య వివాహాల నిరోధానికి మనం అంతా కలిసి కట్టుగా పని చేయాలని మనమంతా పలు నినాదాలను వినే ఉంటాం. కానీ వాటిని ఆచరణలోనికి తీసుకురావడంలో ఎందుకో వెనకబడి ఉన్నాం. బాల్య వివాహాల కట్టడికి ఎన్ని చట్టాలున్నా వీటి పట్ల ప్రభుత్వం ఎంత కఠినంగా వ్యవహరిస్తున్నా సరే నేటికీ అనేక చోట్ల ఇవి జరుగుతూనే ఉన్నాయి. ఏది మంచో ఏది చెడో తెలియని వయసులోనే ప్రేమ పెళ్లి చేసుకునే వాళ్లు కొందరైతే, తల్లిదండ్రుల ఒత్తిళ్లతో ఒప్పుకున్న వారు మరికొందరు ఇందులో ఉంటుండటం గమనార్హం. అదే విధంగా ఏదైనా సమస్య వస్తే అర్ధాంతరంగా వివాహ బంధాన్ని సైతం మధ్యలోనే వదిలేస్తున్నారు. దీనికి తోడు టీనేజ్‌లో పెళ్లి చేసుకోవడం వల్ల అనేక అనారోగ్య సమస్యలను కూడా ఎదుర్కొంటున్నారు. మరి వీటి కట్టడికి ఎలాంటి చర్యలు తీసుకోవాలి? ఇవే అంశాలపై ప్రజలకు అవగాహన కల్పిస్తున్న యువ సామాజిక కార్యకర్త సౌజన్య ఏమన్నారో ఇప్పుడు తెలుసుకుందాం.  

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS