పోలవరంలో సీఎం చంద్రబాబు పర్యటన - ఆకట్టుకున్న డ్రోన్​ దృశ్యాలు

ETVBHARAT 2026-01-07

Views 18

CM Chandrababu Visit Polavaram Project Drone Visuals at Eluru District: ఏలూరు జిల్లా పోలవరంలో ముఖ్యమంత్రి చంద్రబాబు పర్యటించారు. పోలవరం నిర్మాణ పనుల పురోగతిని సీఎం అడిగి తెలుసుకున్నారు. ఈ క్రమంలో కాఫర్‌ డ్యామ్‌, బట్రస్‌ డ్యామ్​ పనులను సందర్శించారు. ఈసీఆర్‌ఎఫ్‌ గ్యాప్‌ 1, గ్యాప్‌ 2 పనులతో పాటు తుది దశకు చేరుకున్న డయాఫ్రం వాల్‌ పనుల వివరాలపై అధికారులను అడిగి తెలుసుకున్నారు. ప్రాజెక్టులో భాగమైన జంట సొరంగాలను సీఎం పరిశీలించారు. 

ఏరియల్‌ వ్యూ ద్వారా పోలవరం ప్రాజెక్టు పరిసరాలను సీఎం చంద్రబాబు పరిశీలించారు. చంద్రబాబుకు జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు, పలువురు ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు ఘన స్వాగతం పలికారు. 2027 నాటికి పోలవరం పూర్తి చేసి జాతికి అంకితం చేస్తామని గత నెలలో జిల్లాలోని గొల్లగూడెం పర్యటనలో సీఎం ప్రకటించారు. ప్రస్తుతం పోలవరం డ్రోన్ దృశ్యాలు ఆకట్టుకుంటున్నాయి. భారీ యంత్రాలతో ప్రాజెక్టు పనులు వేగవంతంగా జరుగుతున్నాయి. ప్రస్తుతం ఈ వీడియోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్​ అయ్యాయి.  

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS