సెల్ ఫోన్లలో తెలుగు వెబ్ సైట్లలోని అక్షరాలు బాక్సులుగా కన్పిస్తున్నాయని చాలామంది కంప్లయింట్ చేస్తుంటారు. Windows Mobile 6.5 ఆపరేటింగ్ సిస్టమ్ ఆధారిత ఫోన్ల లో తెలుగు వెబ్ సైట్లని ఎలాంటి ఇబ్బందీ లేకుండా ఎలా బ్రౌజ్ చేసుకోవచ్చో ఏడాది క్రితం కంప్యూటర్ ఎరా తెలుగు మాసపత్రికలో స్టెప్ బై స్టెప్ వివరంగా రాశాను. Android ఆపరేటింగ్ సిస్టమ్ ఆధారిత ఫోన్లలో తెలుగు యూనీకోడ్ వెబ్ సైట్లని ఎలా చదువుకోవచ్చో ఈ క్రింద నేను షూట్ చేసిన వీడియోలో తెలియజేస్తున్నాను. స్పీకర్లు ఆన్ చేసుకుని వింటూ చూస్తే ఈజీగా అర్థమవుతుంది.