గువహటి వేదికగా ఆస్ట్రేలియాతో జరిగిన రెండో టీ20లో టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని అరుదైన రికార్డుని నెలకొల్పాడు. మూడు టీ20ల సిరిస్‌లో భాగంగా గత మంగళవారం భారత్-ఆసీస్ జట్ల మధ్య రెండో టీ20 జరిగిన సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్‌లో ధోని రెండో రన్ కోసం గంటకు 31 కిలోమీటర్ల వేగంతో పరిగెత్తాడు. ధోనీ రన్నింగ్ విశ్లేషణ వీడియోను స్టార్ స్పోర్ట్స్ తన అధికారిక ట్విట్టర్‌లో పోస్టు చేసింది. 'ధోనీ రన్నింగ్ రికార్డును ఎవరూ బ్రేక్ చేయలేరు' అంటూ కామెంట్ కూడా పోస్టు చేసింది.