India captain Virat Kohli and his long-time girlfriend, Bollywood superstar Anushka Sharma, are expected to get married this December.
టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ, బాలీవుడ్ నటి అనుష్క శర్మలు పెళ్లెప్పుడు చేసుకుంటారా? అని అటు క్రికెట్ అభిమానులు, ఇటు సినీ అభిమానులు వేయి కళ్లతో ఎదురుచూస్తున్న సంగతి తెలిసిందే. అయితే వీరిద్దరూ డిసెంబరులో ఒక్కటి కాబోతున్నారనే వార్తలు మంగళవారం జాతీయ మీడియాలో వచ్చాయి. డిసెంబరులో వీరిద్దరి వివాహం అంగరంగ వైభవంగా జరగనుందని తెలుస్తోంది. అయితే దీనిపై ఇరు కుటుంబ సభ్యుల నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉందివిరాట్ కోహ్లీ, అనుష్క శర్మలు గత కొన్నేళ్లుగా ప్రేములో మునిగి తేలుతున్న సంగతి తెలిసిందే. 2015లో వీరిద్దరి మధ్య లవ్ బ్రేకప్ అయిందన్న వార్తలు కూడా అప్పట్లో హల్‌చల్ చేశాయి.