నయనతార రహస్య వివాహం? : Nayanthara secret wedding

Filmibeat Telugu 2017-10-29

Views 1K

After a breakup with Prabhudeva, Nayanthara has gone head over heels for her Nanum Rowdy Dhaan director Vignesh Shivan and since then they are said to be dating. Buzz has that Nayan and her beau is in plans for a secret wedding. They are likely to get married at Arya Samaz in a private affair that will see only close friends and relatives.

స్టార్ హీరోయిన్లు రహస్యంగా పెళ్లి చేసుకోవడం ఇండస్ట్రీలో కొత్తేమీకాదు. ఎందుకు అలా చేస్తారు? అంటే.... పెళ్లయిన హీరోయిన్లకు ఇండస్ట్రీలో అవకాశాలు తక్కువగా ఉంటాయని, అందుకే ఈ విషయాలను రహస్యంగా ఉంచుతారని అంటుంటారు. ప్రస్తుతం వరుస అవకాశాలతో దూసుకెలుతున్న నయనతార విషయంలో కూడా ఇలాంటి వార్తలే వినిపిస్తున్నాయి. కొన్ని రోజులుగా దర్శకుడు విఘ్నేష్ శివన్ తో ప్రేమాయణం కొనసాగిస్తున్న నయనతార అతడిని రహస్యంగా పెళ్లి చేసుకునేందుకు ప్లాన్ చేసుకుంటున్నట్లు పుకార్లు షికార్లు చేస్తున్నాయి.

ప్రస్తుతం ఈ ఇద్దరూ కలిసే చెట్టాపట్టాలేసుకుని తిరుగుతున్నారు. ఇటీవల కాలంలో ఇద్దరూ విదేశీ ట్రిప్స్ వేయడం, ఆయా కార్యక్రమాల్లో కలిసి పాల్గొనడం లాంటివి చేస్తున్నారు. దీంతో ఈ పుకార్లకు మరింత బలం చేకూరినట్లు అవుతోంది.

Share This Video


Download

  
Report form