beautiful actress Surveen Chawla is officially taken. The actress posted an adorable picture with her husband Akshay Thakker on her Twitter page.
ఈ మధ్య కాలంలో కొందరు సినిమా స్టార్లు పెళ్లి వేడుక ఎవరికీ తెలియకుండా రహస్యంగా జరుపుకుంటున్నారు. పెళ్లి తంతు ముగిసిన తర్వాత సోషల్ మీడియా ద్వారా విషయం బయట పెడుతున్నారు. ఇటీవల అనుష్క-విరాట్ కోహ్లి వివాహం కూడా అలానే జరిగిన సంగతి తెలిసిందే.
తాజాగా ఓ బాలీవుడ్ హీరోయిన్ రెండేళ్ల క్రితం రహస్య వివాహం చేసుకుని ఇపుడు విషయం బయట పెట్టి అందరినీ ఆశ్చర్య పరిచింది.
బాలీవుడ్ మూవీ ‘హేట్ స్టోరీ 2' సినిమాలో బోల్డ్‌గా నటించి వార్తల్లోకి ఎక్కన సుర్వీన్ చావ్లా తన భర్త ఇతడే అంటూ సోషల్ మీడియాలో అక్షయ్ ఠాకూర్ అనే బిజినెస్ మేన్ ఫోటోను పోస్టు చేయడం చర్చనీయాంశం అయింది.
బాలీవుడ్ మీడియా కథనాల ప్రకారం రెండేళ్ల క్రితమే అంటే... జులై 28, 2015లోనే వీరి వివాహం ఉత్తర ఇటలీలో జరిగిందని తెలుస్తోంది. అయితే రెండేళ్ల పాటు వీరు తమ వివాహ విషయాన్ని ఇంత రహస్యంగా ఎలా ఉంచారనేది ఎవరికీ అర్థం కావడం లేదు.
తమ పెళ్లి విషయాన్ని 2018లొ అనౌన్స్ చేయాలని సుర్వీన్ చావ్లా, అక్షయ్ ఠాకూర్ ప్లాన్ చేసుకున్నారు. అందుకు తగిన విధంగానే ఏర్పాట్లు జరుగుతున్నాయి.
సుర్వీన్ చావ్లా తెలుగులో 2009లో వచ్చిన ‘రాజు మహారాజు' అనే సినిమా చేసింది. ఈచిత్రంలో మోహన్ బాబు, శర్వానంద్ ముఖ్య పాత్రలు పోషించారు. ప్రస్తుతం ఆమె బాలీవుడ్ సినిమాల్లో నటిస్తూ బిజీగా గడుపుతున్నారు.