Former Mulugu MLA seetakka joined in Congress with Revanth Reddy
des : Former Mulugu MLA seetakka joined in Congress with Revanth Reddy on Tuesday at Delhi. After Revanth reddy's wife discussed with Seetakka, She changed her decission to continue in TDP. Then she decided to join Congress.
ఉమ్మడి వరంగల్ జిల్లా ములుగు మాజీ ఎమ్మెల్యే సీతక్క టిడిపిని వీడి కాంగ్రెస్ పార్టీలో చేరడంలో రేవంత్‌రెడ్డి సతీమణి కీలకపాత్ర పోషించారనే ప్రచారం సాగుతోంది.సీతక్క టిడిపిలోనే కొనసాగుతారనే అందరూ భావించారు. కానీ,, అనుహ్యంగా సీతక్క రేవంత్‌తో పాటే కాంగ్రెస్ పార్టీలో చేరారు. అయితే టిఆర్ఎస్ నేతలు సీతక్కను సంప్రదించిన మీదట టిడిపిలోనే కొనసాగుతారని ప్రకటించారు. దరిమలా రేవంత్‌రెడ్డి చక్రం తిప్పడంతో సీతక్క అనుహ్యంగా కాంగ్రెస్ పార్టీలో చేరినట్టు చెబుతున్నారు.రేవంత్‌రెడ్డితో పాటు కీలకమైన నేతలు టిడిపిని వీడారు. అయితే పార్టీతోనే కొనసాగుతామని ప్రకటిస్తూ వచ్చిన సీతక్క అనుహ్యంగా ఢిల్లీకి వెళ్ళారు. టిడిపికి రాజీనామా చేసి రాహుల్‌గాంధీ సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు.