Congress leader Revanth Reddy questioned KTR that why he met Satyam Ramalinga Raju's son secretly.
విషయమేదైనా నేరుగా కేసీఆర్‌ను ఢీకొట్టాలనే ప్రయత్నం ద్వారా రేవంత్ రెడ్డి మీడియా ఫోకస్‌ను తనవైపు తిప్పుకున్నారు. నిర్మాణాత్మక విమర్శలు లేకుండా కేవలం వ్యక్తిగతంగా టార్గెట్ చేయడం మేదావులకు నచ్చకపోవచ్చు గానీ ఇప్పటికైతే దానివల్ల ఆయనకు కావాల్సినంత ఫోకస్ లభించింది.అయితే కేసీఆర్‌ను అధిగమించే స్థాయికి రేవంత్ చేరుకోవాలంటే ఇప్పుడున్న వైఖరినే కొనసాగిస్తే సరిపోతుందా? అంటే దానికి ఇప్పుడే సమాధానం చెప్పడం కష్టం. రేవంత్ పార్టీ మారడం స్తబ్దుగా సాగుతున్న తెలంగాణ రాజకీయాలను రసవత్తరంగా మార్చిందని మాత్రం చెప్పవచ్చు.ఈ నేపథ్యంలో రేవంత్ రెడ్డి, కేసీఆర్ వర్గానికి మధ్య మాటల యుద్దం మళ్లీ రాజుకున్నట్టే కనిపిస్తోంది. కాంగ్రెస్ లో చేరికపై రైఫిల్ రెడ్డి ఇప్పుడు పిట్టల దొరలా మారాడని కేటీఆర్ విరుచుకుపడితే.. రేవంత్ కూడా అదే స్థాయిలో ఆయనకు కౌంటర్ ఇచ్చే ప్రయత్నం చేశారు
ఇదిగో కేటీఆర్ దాచిన సత్యం అనే శీర్షికతో రేవంత్ తన అధికారిక ఫేస్ బుక్ లో ఒక పోస్టు చేశారు. '2016లో జరిగిన అఫీషియల్ పోగ్రాంలో అనఫీషియల్‌గా తేజారాజు S/O సత్యం రామలింగరాజుతో మలేషియన్ ప్రధానిని కలిసి మంతనాలాడిన స్కాంస్టార్ కేటీఆర్ కు ముందుంది 'క్రోకోడైల్ ఫెస్టివల్' అని పోస్టు ద్వారా ఘాటు రిప్లై ఇచ్చారు.