While Virat Kohli did no harm to his reputation of being one of the best batsmen going around despite India losing the second Twenty20 against New Zealand, MS Dhoni, despite his 49-run knock off 37 balls, is facing calls of stepping aside from T20s to give a chance to youngsters.
టీ20 ఫార్మాట్ నుంచి టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని తప్పుకునే సమయం ఆసన్నమైందని మాజీ క్రికెటర్ వీవీఎస్ లక్ష్మణ్ అన్నాడు. టీ20 ఫార్మాట్ నుంచి ధోని తప్పుకుని యువ క్రికెటర్లకు ఆడేందుకు అవకాశం ఇవ్వాలని లక్ష్మణ్ సూచించాడు. పరిమిత ఓవర్ల క్రికెట్‌లో వన్డే ఫార్మాట్‌కు మాత్రమే పరిమితమై టీ20ల నుంచి ధోని తప్పుకుంటే బాగుంటుందని లక్ష్మణ్ పేర్కొన్నాడు. 'టీ20ల్లో ధోని నాలుగో స్ధానంలో బ్యాటింగ్‌కు వస్తున్నాడు. ఈ స్ధానంలో బ్యాటింగ్‌కు వచ్చేటప్పుడు క్రీజులో కుదురుకోవడానికి ఎక్కువ సమయం తీసుకునే ఆస్కారం ఉండదు' అని లక్ష్మణ్ అన్నాడు.