Andhra Pradesh Tourism Minister Bhuma Akhila Priya on Monday visited boat capsized place. Andhra Pradesh Chief Minister Nara Chandrababu Naidu visited Feri Ghat on Monday morning.
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సోమవారం ఫెర్రీఘాట్ ప్రమాద స్థలాన్ని సందర్శించారు. విజయవాడలో జరిగిన ఓ బోటు ప్రమాదంలో ఇప్పటి వరకు 19 మంది మృతి చెందిన విషయం తెలిసిందే.ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారులను అడిగి వివరాలు తెలుసుకున్నారు. అనంతరం ఆయన అసెంబ్లీలో ప్రకటన చేయనున్నారు.
కాగా కృష్ణా నదిలో చోటు చేసుకున్న ఘోర పడవ ప్రమాదం రాష్ట్రవ్యాప్తంగా సంచలనం రేకెత్తించింది. మృతుల సంఖ్య 19కి చేరడం ప్రమాద తీవ్రతను మరింత పెంచింది.
కాగా, ప్రమాదం జరిగిన సమయంలో చంద్రబాబు అమరావతిలో లేరు. కేరళ పర్యటనలో ఉన్నారు. సోమవారం విజయవాడకు చేరుకున్న ఆయన నేరుగా బోటు ప్రమాదం జరిగిన ప్రాంతానికి వెళ్లారు. చంద్రబాబు వెంట మంత్రి కామినేని శ్రీనివాసరావుతో పాటు పలువురు నేతలు, విజయవాడ పోలీస్ కమిషనర్, కృష్ణా జిల్లా కలెక్టర్ ఉన్నారు.
కృష్ణానది పవిత్ర సంగమం వద్ద పడవ బోల్తా పడిన ఘటనలో మృతుల బంధువుల కన్నీటిగాథలు అందర్నీ కదిలించివేస్తున్నాయి. కాగా, ఈ ఘటన తన కన్నబిడ్డను కోల్పోయిన ఓ వృద్ధురాలి గుండె ఆగిపోయింది. దీంతో ఆ కుటుంబంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.