Minister for ap Tourism Bhuma Akhila Priya said a new water policy would be put in place soon in the State and boat licences would be cancelled under the new policy if it is found that safety measures were not implemented.
కృష్ణా నదిలో బోటు పడవ గురించి ఆసక్తికర విషయాలు వెలుగు చూస్తున్నాయి. ప్రయాణీకులను ఎక్కించుకున్న ఆ బోటు చేపల పడవగా తెలుస్తోంది.డబ్బుల సంపాదన కోసం సముద్రంలో చేపలు పట్టేందుకు ఉపయోగించే పడవనే తీసుకు వచ్చి కొన్ని మార్పులు చేర్పులు చేసి బోటుగా మార్చారని తెలుస్తోంది.
ప్రమాదానికి గురైన బోటును మంగళవారం అధికారులు బయటకు తీశారు. దీనిని పరిశీలించారు. అది చేపల వేటకు ఉపయోగించే బోటుగా అధికారులు, మత్స్యకారులు నిర్ధారించారు. గతంలో చేపల వేటకు ఉపయోగించిన ఓ బోటును కాకినాడలో కొనుగోలు చేసినట్లుగా గుర్తించారని తెలుస్తోంది.
చేపల వేటకు ఉపయోగించే బోటుకు మరమ్మత్తులు చేసి నదిలో తిరిగే లాంచీ మాదిరిగా మార్చారని అంటున్నారు. ఈ బోటుకు పది మందికి అటు ఇటుగా మాత్రమే తీసుకు వెళ్లే సామర్థ్యం ఉందని చెబుతున్నారు. పది మంది ఎక్కాల్సిన బోటులో 40 మంది ఎక్కారని అంటున్నారు.