NTR, Trivikram Srinivas movie started in October second week. But there is lot of rumours viral in media about Movie Project was stalled. In this situation, Film Unit given clarity about this movie. They said that NTR, Trivikram movie will go on sets in next year February or March.
నిజం గడప దాటకముందే.. అబద్ధం ప్రపంచాన్ని చుట్టివస్తుందనే సామెత సినిమా పరిశ్రమకు చాలా చక్కగా సరిపోతుంది. ఇటీవల కాలంలో త్రివిక్రమ్, ఎన్టీఆర్ సినిమాపై వస్తున్న రకరకాల రూమర్లు మీడియాలో ఎక్కువగానే కనిపిస్తున్నాయి. కథ విషయంలో విభేదాలు వచ్చాయని, కీలక పాత్రలో ప్రముఖ నటి విషయంలో ఏదో జరిగిందనే వార్తలు జోరుగా షికారు చేస్తున్నాయి. అయితే ఈ రూమర్లకు తెర దించేందుకు చిత్ర యూనిట్‌ను ఫోన్‌లో తెలుగు ఫిల్మీబీట్ సంప్రదించగా.. ప్రాజెక్ట్ ఆగిపోలేదు అని క్లారిటీ ఇచ్చారు.
ఎన్టీఆర్, త్రివిక్రమ్ సినిమా విషయంలో వస్తున్న గాసిప్ వార్తల్లో నిజం లేదు. సినిమా ఆగిపోలేదు. ఫిబ్రవరి లేదా మార్చిలో సెట్స్‌పైకి వెళ్తుంది. మూమ్మాటికి ఈ ప్రాజెక్ట్ ముందుకు వెళ్తుంది అని వివరణ ఇచ్చారు.
అలాగే సీనియర్ నటి ఎంపిక విషయంలో విభేదాలు వచ్చాయనే విషయం కూడా అవాస్తవమే. ఇంకా నటీనటుల ఎంపిక జరుగలేదు. పూర్తి కాలేదు. త్వరలోనే నటీనటుల వివరాలు వెల్లడిస్తారు అని చెప్పారు.
ప్రస్తుతం పవన్ కల్యాణ్ సినిమా కోసం త్రివిక్రమ్ శ్రీనివాస్ పూర్తి సమయాన్ని కేటాయించారు. పవన్ సినిమా సంక్రాతికి ప్రేక్షకుల ముందుకు వస్తుంది. ఆ తర్వాత ఎన్టీఆర్ సినిమా ప్రారంభం అవుతుంది అని చిత్ర యూనిట్‌కు సంబంధించిన కీలక వ్యక్తి వెల్లడించారు.