YS Jagan Padayatra : బాబు అవసరమా? పాదయాత్రలో ఎవరిని పలకరించినా | Oneindia Telugu

Oneindia Telugu 2017-11-15

Views 3

YSRCP supremo YS Jaganmohan Reddy covered 100 km as his Praja Sankalpam padayatra on Tuesday reached Kurnool district

కడప జిల్లాలో ముగిసిన వైసీపీ అధినేత జగన్ పాదయాత్ర మంగళవారం నుంచి కర్నూలు జిల్లాలో ప్రవేశించింది. కర్నూలు జిల్లా చాగలమర్రి నుంచి కొనసాగిన ఆయన పాదయాత్ర ముత్యాలంపాడు బస్టాండు మీదుగా సాగింది.ముత్యాలంపాడు బస్టాండు వద్ద ఏర్పాటు చేసిన బహిరంగ సభలో జగన్ ప్రసంగించారు. చంద్రబాబు ప్రభుత్వ వైఫల్యాలను, భవిష్యత్తులో తమ పార్టీ తీసుకురాబోయే సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించారు. ప్రతీ పేదవాడికి అండగా నిలబడాలన్నదే తమ ధ్యేయంగా ఆయన వ్యాఖ్యలు చేశారు.
రాష్ట్రంలో చంద్రబాబు ప్రభుత్వం అవినీతిమయంగా మారింది. ఎక్కడ చూసినా పేదలకు సంక్షేమ పథకాలు అందని పరిస్థితి. ఎన్నికల్లో ఇచ్చిన హామిలను గాలికొదిలేశారు. ఇంతవరకూ ఏ ఒక్క హామి కూడా నెరవేర్చలేదు. మీరంతా ఒక్క ఏడాది ఓపిక పట్టండి. మన ప్రభుత్వం వస్తుంది. పేదలు, రైతులు ఆకాంక్షించే పాలన సాగిద్దాం' అంటూ జగన్ ప్రసంగించారు.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS