YS Jagan padayatra : బీసీలకు అండగా ఉంటా, బాబు లా మోసం చెయ్యను !

Oneindia Telugu 2017-12-09

Views 17

YSRCP President YS Jaganmohan Reddy on Saturday lashed out at Andhra pradesh CM Chandrababu for reservation issue.

రిజర్వేషన్ల పేరుతో మరోసారి ఏపీ సీఎం చంద్రబాబునాయుడు మోసం చేస్తున్నారని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి ఆరోపించారు. ప్రతీ కులాన్ని మోసం చేయటమే లక్ష్యంగా చంద్రబాబు పాలన కొనసాగుతోందని మండిపడ్డారు.
ప్రజాసంకల్పయాత్రలో భాగంగా శింగనమల నియోజకవర్గం గార్లదిన్నె సమీపంలో నిర్వహించిన బీసీ సదస్సులో ఆయన ప్రసంగించారు. నాలుగేళ్ల చంద్రబాబు నాయుడు పాలనలో జరిగిన అన్యాయం, బీసీలు ఎదుర్కొంటున్న సమస్యలపై చర్చించేందుకే ఈ ఆత్మీయ సమ్మేళనం నిర్వహించినట్లు వైయస్‌ జగన్‌ చెప్పారు.
చంద్రబాబు నాలుగేళ్ల పాలనలో ఒక్కరైనా సంతోషంగా ఉన్నారా? అని వైయస్ జగన్‌ ప్రజలను ప్రశ్నించారు. కులాలను మార్చే అధికారం రాష్ట్రాలకు లేదని.. కానీ, ప్రతీ కులాన్ని ఎలా మోసం చేయాలనే ఉద్దేశంతో చంద్రబాబు మ్యానిఫెస్టో పెట్టారని, అందుకు ఇప్పుడు కళ్ల ముందు కనిపిస్తున్న పరిస్థితులే నిదర్శనమని జగన్‌ చెప్పారు. కురుమలను ఎస్టీల్లో చేరుస్తానని , బోయలను ఎస్టీల్లో చేరుస్తానని మూడుసార్లు తీర్మానం చేశారని, రజకులను ఎస్సీలుగా మారుస్తానని చం‍ద్రబాబు చెప్పారని.. కానీ, ఆ హామీల్లో ఏ ఒక్కటీ అమలు చేయలేదని వైయస్‌ జగన్ తెలిపారు. సినిమాల్లోని విలన్ల కన్నా దారుణంగా చంద్రబాబు వ్యవహరిస్తున్నారు అన్నారు, బీసీల అభివృద్ధి అంటే వారిని పేదరికంలోని ఎలా బయటకు తీసుకురావాలి.. వారి అభివృద్ధికి ఏమేం చేయాలో ఆలోచించాలి.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS