President Donald Trump has mostly stayed on message during his nearly two-week trip to Asia, Trump lobbed a sarcastic putdown at North Korean leader Kim Jong Un, calling him “short and fat.
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కొత్త రాగం అందుకున్నారు. నిన్న మొన్నటి వరకు ఉత్తరకొరియా అధినేత కిమ్ జోంగ్ ఉన్ పై మండిపడిన ఆయన ఇప్పుడు మాటమార్చారు. వీలైతే కిమ్ తో ఫ్రెండ్షిప్ చేసుకుంటానని కూడా చెబుతున్నారు.
''కిమ్ నన్ను 'ఓల్డ్‌మ్యాన్' అంటూ అవమానిస్తున్నారు. నేనూ అతన్ని 'లిటిల్ అండ్ ఫ్యాట్' అని పిలుస్తూ అగౌరవపరుస్తున్నాను.. ఇకపై కిమ్‌ను అలా పిలవరాదని భావిస్తున్నాను..'' అంటూ అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ట్వీట్ చేశారు.
12 రోజుల ఆసియా పర్యటనలో భాగంగా ప్రస్తుతం వియత్నాంలో ఉన్న ట్రంప్ పై విధంగా వ్యాఖ్యానించారు. అంతేకాదు, 'కిమ్‌తో స్నేహం చేయాలని చాలా కాలంగా ప్రయత్నిస్తున్నాను. ఏదో ఓ రోజు మేమిద్దరం మంచి స్నేహితులమవుతాం..' అని కూడా ఆయన తన ట్వీట్ లో పేర్కొన్నారు. ఇదే విషయాన్ని మీడియా ప్రతినిధులు ట్రంప్ ఎదుట ప్రస్తావించగా... 'అవును, కిమ్‌తో ఫ్రెండ్‌షిప్ చేయాలని అనుకుంటున్నాను. ఆయన మాతో స్నేహం చేస్తే ఉత్తరకొరియాకు చాలా మంచిది. ప్రపంచ దేశాలకూ చాలా మంచిది..' అని ట్రంప్ అన్నారు.