While a controversy rages over "Padmavati", the Central Board of Film Certification has returned filmmaker Sanjay Leela Bhansali's application citing "technical deficiencies" in it, likely delaying its release.
సృజనాత్మకత కలిగిన దర్శకుడిగా పేరు ప్రఖ్యాతులు ఉన్న సంజయ్‌లీలా భన్సాలీ నిర్మించిన 'పద్మావతి'కి షూటింగ్ ప్రారంభం నుంచే కష్టాలు చుట్టుముట్టాయి. వచ్చేనెల ఒకటో తేదీన విడుదల కానున్న ఈ సినిమాను నిషేధించాలంటూ రాజ్‌పుత్ కర్ణిసేన చేస్తున్న ఆందోళన ఉద్రిక్తతకు దారి తీసింది. ఈ సినిమా రాజపుత్రులను కించపరిచేలా ఉన్నదని పేర్కొంటూ దేశవ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. రాజస్థాన్ లోని ఛిత్తోడ్ గడ్ కోట వద్ద నిరసన కాల్పులు జరిపే వరకూ వెళ్లింది. గతంలో సినిమా షూటింగ్ ప్రారంభం నుంచే ఈ సినిమా వివాదాల్లో చిక్కుకున్నది. అటువంటి చిత్రాల భారీన 'పద్మావతి' చిత్రం ఇప్పుడు అలాంటి మూకల బారిన పడింది. రాజస్థాన్‌లోని జైపూర్‌లో వేసిన సెట్‌లోకి చొరబడి ఆ సెట్‌నూ, విలువైన పరికరాలనూ ధ్వంసం చేయడంతోపాటు భన్సాలీపై దౌర్జన్యం చేశారు. ఆ తర్వాత షూటింగ్‌ను మహారాష్ట్రలోని కొల్హాపూర్‌కు మార్చుకుంటే అక్కడా సెట్‌కు నిప్పు పెట్టారు.