Sanjay Leela Bhansali perhaps could have never imagined that his magnum opus Padmavati would divide an entire country with contrasting opinions. Right from the time the filming of Padmavati began, there have been agitations around the film.
పద్మావతి సినిమా వివాదాల సుడిగుండం నుండి ఇప్పుడప్పుడే బయటపడేలా కనిపించడం లేదు. సినిమాలో చరిత్రను వక్రీకరించారని ఉత్తర భారతంలోని పలు రాష్ట్రాలలో ఓవైపు ఆందోళనలు కొనసాగుతున్నాయి. చిత్ర దర్శకుడు సంజయ్ లీలా భన్సాలీతోపాటు సినిమాలో నటించిన వారికి హెచ్చరికలు జారీ అవుతూనే ఉన్నాయి. హర్యానా బీజేపీ నేత సూరజ్ పాల్ అమూ.. మరో అడుగు ముందుకేసి దేశవ్యాప్తంగా ఆ సినిమా ప్రదర్శించే సినిమా థియేటర్లను తగులబెట్టేందుకు వెనుకాడబోమని హెచ్చరించేందుకు వెనుకాడలేదు. టాలీవుడ్‌కు చెందిన చెందిన ప్రముఖ నటుడు ప్రకాశ్ రాజ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. 'సినీ ప్రముఖులకు హెచ్చరికలు జారీ చేస్తుంటే కేంద్రం ఏం చేస్తున్నది' అని నిలదీశారు. 'మీకు భారీ మెజారిటీ ఇచ్చాం.ఇటువంటి బెదిరింపులు ఆపలేరా? శాంతిభద్రతలు పరిరక్షించకపోతే దిగిపోండి' అని ఘాటుగా స్పందించారు. చారిత్రక ఆధారాలపై వివాదం చెలరేగుతున్న నేపథ్యంలో సినిమాపై చరిత్రకారులు, నిపుణులను సంప్రదించనున్నట్లు సెన్సార్ బోర్డు తాజాగా ప్రకటించింది.