13 coaches of Vasco Da Gama-Patna Express went off track in Manikpur near Uttar Pradesh's Banda, early morning on Friday. 3 people lost life and eight got injured in the derailment.
ఉత్తర ప్రదేశ్‌లో మళ్ళీ రైలు ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో 3 మృతి చెందగా, ఎనిమిది మంది వరకు గాయపడ్డారు. యూపీలోని బాందా వద్ద శుక్రవారం తెల్లవారుజామున వాస్కోడిగామా - పాట్నా ఎక్స్‌ప్రెస్ పట్టాలు తప్పింది. రైలులోని 13 బోగీలు పట్టాలు తప్పాయి. సమాచారం తెలియగానే సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకున్నారు. ఘటనా స్థలంలో ఇంకా సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ఉదయం 4 గంటలకు ట్రైన్ పట్టాలు తప్పినట్లు అధికారులు చెప్తున్నారు. సహాయక చర్యలు ముమ్మరం చేశామని ఇండియన్ రైల్వేస్ పీఆర్‌ఓ తెలిపారు. హెల్ప్ లైన్ నంబర్స్ ఏర్పాటు చేసినట్లుగా కూడా తెలిపారు. మరికొంత సమయం గడిస్తే తప్ప పూర్తి సమాచారం తెలియదని అధికారులు అంటున్నారు. శుక్రవారం తెల్లవారుజామున మాణిక్‌పూర్ స్టేషన్ నుంచి బయలుదేరిన వాస్కోడిగామా-పాట్నా ఎక్స్‌ప్రెస్ రైలు 4.18 గంటలకు పట్టాలు తప్పింది. ప్రమాదానికి గల కారణాలపై రైల్వే అధికారులు దర్యాప్తు ప్రారంభించారు. చికిత్స పొందుతున్న 9 మందిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉందని సమాచారం.