ఫ్యాక్షన్ రాజకీయాలకు నేను దూరం : వచ్చే ఎన్నికల్లో పోటీ చేయవద్దని చంద్రబాబు అంటారు | Oneindia Telugu

Oneindia Telugu 2017-11-27

Views 2.2K

TDP MP JC Diwakar Reddy on Monday made shoking comments on Andhra Pradesh CM Chandrababu Naidu and YSRCP president YS Jaganmohan Reddy.

జేసీ దివాకర్ రెడ్డి ఏం మాట్లాడినా సంచలనమే అవుతుంది. ప్రస్తుత తెలుగుదేశం పార్టీ ఎంపీగా కొనసాగుతున్న ఆయన ఓ టీవీ ఛానల్‌కు ఇంటర్య్యూలో మాట్లాడుతూ తనదైన శైలిలో వ్యాఖ్యలు చేసి మరోసారి సంచలనంగా మారారు. ఏపీ సీఎం చంద్రబాబునాయుడుపై కీలక వ్యాఖ్యలు చేశారు.తనకు గానీ, తన సోదరుడి(జేసీ ప్రభాకర్ రెడ్డి)కి గానీ మంత్రి పదవులు ఇవ్వాలని చంద్రబాబు భావించడం లేదని, ఆ విషయం తనకు స్పష్టంగా తెలుసునని జేసీ దివాకర్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. వచ్చే ఎన్నికల్లో తమ అన్నదమ్ములను ఎన్నికల్లో పోటీ చేయవద్దని చంద్రబాబు అంటారేమోనన్న అనుమానాన్ని కూడా వ్యక్తం చేశారు. కేంద్రంలో తనకుగానీ, రాష్ట్రంలో తన సోదరుడు ప్రభాకర్ రెడ్డికిగానీ మంత్రి పదవులు దక్కే అవకాశం లేదని జేసీ అన్నారు. తమను కూరలో వాడుకుని, ఆపై పక్కన పడేసే కరివేపాకులా చూస్తున్నారని ఆరోపించారు.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS