Heavy rain hammered coastal Tamil Nadu today as a depression in the Bay of Bengal turned into a cyclonic storm called Cyclone Ockhi about 60 km from the southern tip of the state
తమిళనాడును మరో సారి వర్షాలు ముంచెత్తుతున్నాయి. తమిళనాడు, కేరళ, పుదుచ్చేరితో పాటు లక్షద్వీప్ (లక్ష ద్వీపములు)లో భారీ వర్షాలు పడుతాయని, తుపాను వస్తోందని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది. వాతావరణ శాఖ హెచ్చరించిన కొన్ని గంటల్లోనే కన్యాకుమారి జిల్లా అతలాకుతలం అయ్యింది. గురువారం నుంచి రెండు రోజుల పాటు భారీ వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించడంతో తమిళనాడు ప్రభుత్వం అలర్ట్ అయ్యింది. తమిళనాడు రాజధాని చెన్నై నగరంతో పాటు దక్షిణ తమిళనాడులోని సముద్రతీర ప్రాంతాల్లో భారీ వర్షలు పడుతాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. దక్షిణ తమిళనాడులో భారీ వర్షాలు పడుతున్నాయి. ఇప్పటికే కన్యాకుమారిలో ఇద్దరు మరణించినట్లుగా సమాచారం.
తమిళనాడులో ప్రసిద్ది చెందిన పర్యాటక కేంద్రం కన్యాకుమారిలో అధికారులు హై అలర్ట్ ప్రకటించారు. కన్యాకుమారిలో పర్యాటకులు సముద్రంలో విహరించకుండా నిషేధం విదించారు. కన్యాకుమారి బీచ్ లో ఈత కొట్టడానికి వీల్లేదని అధికారులు ఆంక్షలు విధించారు . తుపాను దెబ్బకు కన్యాకుమారి జిల్లా ప్రజలు హడలిపోయారు. గురువారం మద్యాహ్నం విపరీతమైన గాలులతో భారీ వర్షాలు కురుస్తున్నాయి. వందల కిలోమీట్ల వేగంతో వస్తున్న గాలులకు అనేక ప్రాంతాల్లో చెట్లు కుప్పకూలిపోయాయి.