Chandrababu Naidu South Korea Tour Successfully Completed

Oneindia Telugu 2017-12-07

Views 38

Andhra Pradesh Chief Minister N Chandrababu Naidu’s South Korean tour entered its 3rd and last day on Wednesday. The CM and his delegation, which spent second day at Busan city, returned to Seoul.

ఏపీ సీఎం చంద్రబాబు దక్షిణ కొరియా పర్యటన ముగిసింది. తిరిగి ఆయన గురువారం తెల్లవారుజామున అమరావతికి చేరుకోనున్నారు. కాగా ఈ నెల 4,5,6 తేదీల్లో ముఖ్యమంత్రి అధికార బృందంతో కొరియాలో పర్యటించిన సంగతి తెలిసిందే. పెట్టుబడులే ప్రధానాంశంగా ముఖ్యమంత్రి సియోల్, బూసన్ నగరాలలో పర్యటించారు. కియా మోటార్స్‌కు సంబంధించి 17 అనుబంధ సంస్థలతో ఏపీఐఐసీ, ఈడీబీ అవగాహన ఒప్పందాలు కుదుర్చుకున్నారు. ఇక 5న ఎంబసీతో కలిసి ఏపీ ప్రభుత్వం బిజినెస్ సెమినార్ జరగగా 6న కియా మోటార్స్‌తో కలిసి సియోల్‌లో బిజినెస్ సెమినార్ జరిగింది. రాష్ట్రానికి పెట్టుబడులు తీసుకురావడమే లక్ష్యంగా ఆయన తన మూడు రోజుల పర్యటనలో పలు సంస్థలను సందర్శించారు. కొరియా కార్ల దిగ్గజం కియా, దాని అనుబంధ సంస్థలు కలిపి రూ.13,500 కోట్ల పెట్టుబడులతో అనంతపురం జిల్లాలో అల్ట్రా మెగా ఇంటిగ్రేటెడ్ మొబైల్ ప్రాజెక్టులు నెలకొల్పుతున్నాయి. కాగా అమరావతికి చేరుకున్న బాబు అక్కడనుండి విశాఖపట్నం వెళ్తారు, విశాఖ పర్యటనకు వస్తున్న రాష్ట్రపతి రామనాధ్‌ కోవింద్‌కు చంద్రబాబు స్వాగతం పలుకుతారు. శుక్రవారం మధ్యాహ్నం రాష్ట్రపతి తిరిగి వెళ్లేవరకూ సీఎం విశాఖలోనే ఉంటారు.

Share This Video


Download

  
Report form