Ap Budget Sessions : Chandrababu Naidu Revealed Everything

Oneindia Telugu 2018-03-07

Views 2

The Chief Minister Nara Chandrababu Naidu said there would be no compromise in protecting the state's interests. later Andhra Pradesh Chief Minister Nara Chandrababu Naidu speech about Polavaram and Visakha railway zone.
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గవర్నర్ ప్రసంగానికి ధన్యవాద తీర్మానం సందర్భంగా అసెంబ్లీలో మాట్లాడారు. ఏపీకి ప్రత్యేక హోదా, పోలవరం ప్రాజెక్టు, ఆర్థిక లోటు, విశాఖ రైల్వే జోన్ తదితర అంశాలపై మాట్లాడారు.

విభజన హామీల విషయంలో ఎట్టి పరిస్థితుల్లోను రాజీపడే ప్రసక్తి లేదని . ప్రత్యేక హోదా దెబ్బతిన్న ఏపీ ప్రజల హక్కు అని . కేంద్రం సహకరిస్తే ఏపీ వేగంగా అభివృద్ధి చెందేదని . తాము ఏదీ అదనంగా అఢగలేదని. విభజన చట్టంలో ఉన్నవే అడుగుతున్నామని చంద్రబాబు చెప్పారు. బీజేపీ తప్పించుకోవాలని చూస్తే ప్రజలు క్షమించరన్నారు.

ఈ సందర్భంగా చంద్రబాబు పోలవరం ప్రాజెక్టుకు చేసిన ఖర్చు, కేంద్రం ఇచ్చిన నిధులను వివరించారు. పోలవరం ప్రాజెక్టు పూర్తి కోసం తాను ప్రతి సోమవారం పోలవారంగా సమీక్షిస్తున్నానని చెప్పారు. పోలవరంకు జనవరి వరకు రూ.7వేల కోట్లు ఖర్చు చేశామన్నారు. కేంద్రం నుంచి రూ.5,349 కోట్లు వచ్చిందన్నారు. మరో రెండువేల కోట్లకు పైగా పెండింగులో ఉన్నాయన్నారు. పోలవరం ఏపీకి ఓ వరం అన్నారు.పోలవరం ప్రాజెక్టు వ్యయం రూ.58వేల కోట్లు అని చెప్పారు. మనం చేసిన ఖర్చులో రూ.2566 కోట్లు రావాలన్నారు. పోలవరం అథారిటీకి ఎప్పటికప్పుడు లెక్కలు పంపిస్తున్నామని చెప్పారు. పట్టిసీమతో 100 టీఎంసీలు కృష్ణా డెల్టాకు నీరు తరలించామన్నారు. రాజధానికి రూ.1500 కోట్లు ఇచ్చారని, వాటికి లెక్కలు చెప్పామన్నారు. నేను ఎక్కడా తప్పు చేయలేదని, తనపై ఒక్క కేసు లేదన్నారు. దుగరాజుపట్నం సాధ్యం కాదని చెబుతున్నారని, ఎందుకు సాధ్యం కాదని ప్రశ్నించారు

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS