12న పవన్ ఫ్యాన్స్‌కు మరో గిఫ్ట్

Filmibeat Telugu 2017-12-07

Views 764

Power Star Pawan Kalyan fans got special message from music Director Anirudh Ravi Chander. Pawan's latest movie Agnathavasi's second single song Gaali Vaaluga to be relased on December 12th. This information given by Anirudh in Twitter.

పవర్ స్టార్ పవన్ కల్యాణ్, త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో వస్తున్న అజ్ఞాతవాసి చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ చిత్రం ఇటీవలే టాకీ పార్ట్ పూర్తి చేసుకొని ప్రోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉంది. ఈ సినిమాకు సంబంధించిన ఆసక్తికరమైన వార్తను సంగీత దర్శకుడు అనిరుధ్ రవిచందర్ ట్విట్టర్‌లో పేర్కొన్నారు.
డిసెంబర్ 12వ తేదీన గాలివాలుగా అనే రెండో సాంగ్ సింగిల్స్‌ను రిలీజ్ చేస్తున్నాం అని అనిరుధ్ రవిచందర్ పండుగలాంటి వార్తను అందించాడు. అనిరుధ్ వార్తకు ఫ్యాన్స్ నుంచి మంచి స్పందన కనిపించింది.
ఇంతకు ముందు త్రివిక్రమ్ పుట్టిన రోజును పురస్కరించుకొని బయటకొచ్చి చూస్తే టైం ఏమో త్రీవో క్లాక్ అనే పాటను రిలీజ్ చేసారు. ఆ పాటకు య్యూటూబ్‌లో 6 మిలియన్స్‌కు పైగా వ్యూస్ లభించడం విశేషం.
ఇక నవంబర్ 27 రిలీజ్ చేసిన అజ్ఞాతవాసి టైటిల్ ప్రకటనకు కూడా మంచి స్పందన లభించింది. అభిమానుల్లో ఈ టైటిల్‌ గురించి ముందు నుంచే సమాచారం ఉండటంతో మంచి స్పందన వ్యక్తమైంది.
జనవరి 10న రిలీజ్ అవుతున్న అజ్ఞాతవాసి చిత్రాన్ని హారిక అండ్ హాసిని బ్యానర్‌పై ఎస్ రాధాకృష్ణ నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో పవన్ సరసన కీర్తీ సురేశ్, అను ఇమ్మాన్యుయేల్ నటిస్తున్నారు. ఈ చిత్రంలో ఇంకా కుష్భూ, బోమన్ ఇరానీ తదితరులు కీలకపాత్రలను పోషిస్తున్నారు.

Share This Video


Download

  
Report form