YSR Congress party operation aakars on Telugu Desam. It is said that YSRCP leader Peddireddy Ramachandra Reddy offers AP CM and TDP national president Chandrababu Naidu's right hand Srinath Reddy.
ఓ వైపు టీడీపీ ఆపరేషన్ ఆకర్ష్ చేపడుతుంటే, కొత్త నీరు కారణంగా అధికార పార్టీలోని అసంతృప్తిని సొమ్ము చేసుకునే పనిలో పడింది వైయస్సార్ కాంగ్రెస్. ఎన్నికలకు మరో ఏడాది, ఏడాదిన్నర ఉన్న ఈ సమయంలో టీడీపీ, వైసీపీలు ఆయా నియోజకవర్గాల్లోని, జిల్లాల్లో తమ వైపు చూస్తున్న నేతలపై దృష్టి సారించారు.ఎదుటి పార్టీల్లోని అసంతృప్త నేతలను తమ వైపుకు రప్పించుకునే ప్రయత్నాలు చేస్తున్నాయి. తాజాగా, చిత్తూరు జిల్లాకు చెందిన మాజీ ఎమ్మెల్యే ఒకరికి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ బంపర్ ఆఫర్ ఇచ్చినట్లుగా ప్రచారం సాగుతోంది. ఈ ఆఫర్ వచ్చింది మాజీ ఎమ్మల్యే శ్రీనాథ్ రెడ్డికి అని చెబుతున్నారు.
ఈ విషయాన్ని స్వయంగా శ్రీనాథ్ వెల్లడించారని అంటున్నారు. టీడీపీని వీడి వైసీపీలోకి వస్తే ఎమ్మెల్సీ పదవి ఇస్తామని ఆ పార్టీ నేత పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డి తనకు బంపర్ ఆఫర్ ఇచ్చారని, దాంతో పాటు కాంట్రాక్టు పనులకు పోటీ కూడా రామని హామీ ఇచ్చారని ఆయన చెప్పారు.
కొద్ది రోజుల క్రితం టీడీపీ కండువా కప్పుకున్న మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డి సోదరుడు కిషోర్ కుమార్ రెడ్డిని ఓడించాలనే లక్ష్యంతో తనను వైసీపీలోకి ఆహ్వానించినట్లు శ్రీనాథ్ రెడ్డి వెల్లడించారు. కిషోర్ కుమార్ రెడ్డి తనను సోదరుడిలా భావిస్తున్నారని, తనను కాదని ఏం చేయడం లేదన్నారు.