Himachal: chanakya sarvey: BJP 51, Cong 38, others 11 . Big win forecast for BJP.
గుజరాత్, హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల కోసం అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. గుజరాత్ ఫలితాల తర్వాత హిమాచల్‌లో ఎవరు గెలుస్తారనే ఆసక్తి అందరిలో నెలకొంది. ఇక్కడ 68 స్థానాలు ఉన్నాయి. బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు ప్రధానంగా పోటీ పడ్డాయి. కాగా, హిమాచల్ ప్రదేశ్ బీజేపీతో అని పలు ఎగ్జిట్ పోల్ సర్వేలు చెబుతున్నాయి.
సహారా సమయ్ - సిఎన్ఎక్స్ ఎగ్డిట్ పోల్ బిజెపి 42 నుంచి52 స్థానాలు గెలుచుకుంటుందని సహారా సమయ్ - సిఎన్ఎక్స్ ఎగ్డిట్ పోల్ సర్వే తెలియజేస్తోంది.కాంగ్రెసు పార్టీ 18 నుంచి 24 సీట్లకు పరిమితమవుతుంది.
చాణక్య సర్వే ప్రకారం - బిజెపికి 51 శాతం మంది ఓటు వేయగా, కాంగ్రెసుకు 38 శాతం మంది ఓటేశారు. ఇతరులకు 11 శాతం ఓట్లు పడ్డాయి.
ఇండియా టుడే ఎగ్జిట్ పోల్ సర్వే ప్రకారం హిమాచల్ ప్రదేశ్‌లో బిజెపి విజయకేతనం ఎగురవేసే అవకాశం ఉంది.ఆక్సిస్ మై ఇండియా ప్రకారం బిజెపి: 47 నుంచి 55 కాంగ్రెసు: 13 నుంచి 20 ఇతరులు: 0 నుంచి 2 కు పరిమితమయినట్లు తెలిపింది.