Exit polls predict a victory for the BJP in both Gujarat, where it has ruled since 1998, and in Himachal Pradesh, a state where the two parties have alternate in government.
గుజరాత్ ఎన్నికల ఫలితాల కోసం యావత్ భారత దేశం ఎదురు చూస్తోంది. బీజేపీ అధికార పీఠం నిలబెట్టుకుంటుందా, కాంగ్రెస్ పార్టీ కమలం కోట బద్దలు కొడుతుందా అని అందరిలోను ఆసక్తి ఉంది. కాసేపట్లో ఫలితాలు తేలనున్నాయి. బీజేపీ గెలిస్తే ఇది వరుసగా ఆరోసారి అవుతుంది. మరోవైపు కాంగ్రెస్ గెలిస్తే రెండు దశాబ్దాల తర్వాత గెలుపు అవుతుంది. ఈ ఎన్నికల్లో అభివృద్ది నినాదం వినిపించినప్పటికీ దాని ప్రాధాన్యత చాలా తగ్గింది. కుల, మతాలకు చాలా ప్రాధాన్యత లభించింది. గుజరాత్‌లో 182 స్థానాలు ఉన్నాయి. మ్యాజిక్ ఫిగర్ 92. ఎగ్జిట్ పోల్స్ అన్ని బీజేపీ వైపే మొగ్గు చూపాయి