Dear prime minster, Congratulations for the victory... but are you really happy, Actor Prakash Raj tweeted.
గుజరాత్, హిమాచల్ ప్రదేశ్ ఎన్నికల్లో బీజేపీ విజయం సాధించింది. ఈ నేపథ్యంలో ప్రముఖ నటుడు ప్రకాశ్ రాజ్ స్పందించారు. ఇటీవల పలు అంశాల్లో ప్రధాని మోడీపై ఆయన విమర్శలు గుప్పించిన విషయం తెలిసిందే. ఇప్పుడు బీజేపీ గెలుపుతో మరోసారి స్పందించారు.మోడీ నిజంగా సంతోషంగా ఉన్నారా అంటూ జస్ట్ ఆస్కింగ్ అంటూ హ్యాష్ ట్యాగ్ ఇచ్చారు. మోడీకి శుభాకాంక్షలు, అభివృద్ధి మంత్రంతో 150 సీట్లు గెలుస్తామని చెప్పారని, మరి ఏమయిందని, ఇప్పటికైనా మీరు ఒక్క క్షణం ఆలోచించాలని, గ్రామీణ ప్రాంతాల్లో రైతుల సమస్యలు, పేదరికం, గ్రామీణ భారతంపై దృష్టి పెట్టాలని విజ్ఞప్తి చేశారు.
గుజరాత్ ఎన్నికల ఫలితాలు ఉత్కంఠను రేపిన విషయం తెలిసిందే. బీజేపీకి కాంగ్రెస్ గట్టి పోటీని ఇచ్చింది. ఓ సమయంలో కాంగ్రెస్ గెలుస్తుందేమో అనే టెన్షన్ బీజేపీ నేతలలో కనిపించింది. చివరకు వంద సీట్ల వరకు గెలుచుకొని బీజేపీ సంబరాలు చేసుకుంటోంది. ఈ నేపథ్యంలో సోషల్ మీడియాలో బీజేపీ ఉదయం నుంచి సాయంత్రం వరకు అంటూ ఇలాంటి పోస్టులు సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తున్నాయి. గుజరాత్ ఎన్నికల ప్రచార సమయంలో ప్రధాని మోడీ మాట్లాడిన ఔరంగజేబు, తీవ్రవాదం, పాకిస్తాన్, సీ ప్లేన్, మణిశంకర్ వ్యాఖ్యలు బీజేపీ గెలుపుకు ఉపకరించాయని అంటున్నారు. ఈ నేపథ్యంలో ఇందుకు సంబంధించి సోషల్ మీడియాలో పోస్టులు హల్‌చల్ చేస్తున్నాయి.