భర్త కోసం రూ. 45వేలకు కొడుకు విక్రయం, వీడియో !

Oneindia Telugu 2018-01-02

Views 65

In a shocking incident, a woman sold off her newborn son because she needed money for her husband’s treatment.The incident took place in Bareilly district where Sanju Devi sold her newborn son for Rs 42,000 so that she could pay for her husband’s treatment.

ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన భర్తకు చికిత్స చేయించేందుకు కన్న కొడుకును రూ. 45 వేలకు విక్రయించింది ఓ తల్లి. ఈ ఘటన ఉత్తర్‌ప్రదేశ్ రాష్ట్రంలో చోటు చేసుకొంది. ఉత్తర్‌ప్రదేశ్ రాష్ట్రంలోని బరేలీ జిల్లా ఢాకియా కోహ్ గ్రామానికి చెందిన హర స్వరూప్ మౌర్య, సంజుదేవీలు భార్య, భర్తలు. మౌర్య భవన నిర్మాణ కార్మికుడుగా పనిచేసేవాడు.

ఓ ఇంటి నిర్మాణ పనిలో ఉండగా ప్రమాదవశాత్తు గోడ కూలి మౌర్య తీవ్రంగా గాయపడ్డాడు. మూడు నెలలుగా మౌర్య ఆసుపత్రిలో ఉన్నాడు. భర్త మంచాన పడ్డాడు.దీంతో పూట గడవడం కూడ ఆ కుటుంబానికి కష్టంగా మారింది. అప్పటికే గర్భవతిగా ఉన్న సంజు దేవి మగబిడ్డకు జన్మనిచ్చింది. అయితే భర్తకు వైద్యం చేయించేందుకు తన 15 ఏళ్ళ బిడ్డను రూ.45 వేలకు విక్రయించింది ఆ తల్లి. మౌర్య కుటుంబాన్ని తాము ఆదుకొంటామని అధికారులు ప్రకటించారు. ఈ ఘటనపై అధికారులు దర్యాప్తు చేపట్టారు.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS