Producer Dil Raju is worrying over Agnyathavaaasi collections Due to Pongal holidays effect.
పవర్ స్టార్ ఫ్యాన్స్ అంతా ఇప్పుడు 'అజ్ఞాతవాసి' ఫీవర్‌లో ఉన్నారు. ఎప్పుడెప్పుడు చూద్దామా! అన్న ఆత్రుతలో మునిగిపోయారు. ఫ్యాన్స్ సంగతిలా ఉంటే.. నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్లు మాత్రం కలెక్షన్ల లెక్కల్లో మునిగిపోయారు. ఈ సినిమాకు నైజాం డిస్ట్రిబ్యూటర్‌గా వ్యవహరిస్తున్న దిల్ రాజు మాత్రం ఒకింత ఆందోళనలో ఉన్నారట. ఇంతకీ దిల్ రాజు టెన్షన్‌కు కారణమేంటి?..
సాధారణంగానే నైజాం ఏరియాలో.. ఏ పెద్ద సినిమా వచ్చిన డిస్ట్రిబ్యూషన్‌కు దిల్ రాజు ముందు ఉంటారు. అదే పరంపరలో అజ్ఞాతవాసి సినిమాను కూడా ఆయన భారీ రేటుకు కొనుగోలు చేశారు. దాదాపు రూ.28.5కోట్లు చెల్లించి ఆయన అజ్ఞాతవాసి సినిమా తీసుకున్నట్లు ఫిలింనగర్ వర్గాల భోగట్టా.
అజ్ఞాతవాసిపై అంత భారీగా ఖర్చు చేసిన దిల్ రాజు.. ఎంత లేదన్నా రూ.30కోట్లు వస్తే గానీ సేఫ్ సైడ్ లోకి రారు. అయితే సంక్రాంతి పండుగ కావడం.. ఎక్కువమంది యువత ఊళ్లకు తరలిపోయే అవకాశం ఉండటంతో.. కలెక్షన్ లెక్కలపై తర్జన భర్జన పడుతున్నారట దిల్ రాజు. పైగా అజ్ఞాతవాసికి పోటీగా రెండు రోజుల వ్యవధిలో బాలయ్య జైసింహా కూడా వస్తుందడం కలెక్షన్లపై ప్రభావం చూపుతుందేమో అనుకుంటున్నారట.