Ghazal Srinivas Leaked Video Viral : ఎవరీ గజల్ శ్రీనివాస్?

Oneindia Telugu 2018-01-03

Views 478

A Video of Gajal Srinivas has been going viral in Social media. Kesiraju Srinivas, popularly known as Ghazal Srinivas, holds the Guinness World Record for most languages sung.

లైంగిక వేధింపుల కేసులో అరెస్టు కావడంతో గజల్ శ్రీనివాస్ చిక్కుల్లో పడ్డారు. పోలీసులు ఆయనను అరెస్టు చేశారు. అయితే, ఆయనకు పేరు ప్రఖ్యాతులు మెండుగానే ఉన్నాయి. ప్రస్తుత కేసుతో ఆయన వ్యక్తిత్వంపై మచ్చ పడింది. కేసు బలంగానే ఉందని పోలీసులు అంటున్నారు. గజల్ శ్రీనివాస్‌గా పేరు సంపాదించుకున్న ఆయన ప్రత్యేక తెలంగాణ ఉద్యమంలో సమైక్య ఉద్యమానికి బాసటగా నిలచారు. సమైక్యాంధ్ర కోసం పాటలు కట్టి ప్రదర్శనలు ఇచ్చారు.
గజల్ శ్రీనివాస్‌గా ప్రసిద్ధి చెందిన కేశిరాజు శ్రీనివాస్ తెలుగు గజల్ గాయకుడు. గజల్ శ్రీనివాస్ 125 ప్రపంచ భాషలలో గాంధేయవాదంపై గజల్స్ పాడారు. తద్వారా మూడు గిన్నీస్ ప్రపంచ రికార్డులను, లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్ నెలకొల్పాడు.శ్రీనివాస్ అమెరికాలో అనేక సార్లు పర్యటించి తెలుగు తోరణం అనే పేరుతో కార్యక్రమాలు నిర్వహించారు.

kaagaa మహిళను లైంగికంగా వేధించిన కేసులో అరెస్టయిన గజల్ శ్రీనివాస్ బెయిల్‌కు సంబంధించి బుధవారం నాంపల్లి కోర్టులో వాదనలు జరిగాయి. అంతకుముందు, బెయిల్ ఇవ్వవద్దని పంజాగుట్ట పోలీసులు కౌంటర్ దాఖలు చేశారు. ఆయన బెయిల్ కోసం దరఖాస్తు చేసుకున్న విషయం తెలిసిందే. గజల్ శ్రీనివాస్ బయటకు వస్తే సాక్షులను ప్రభావితం చేసే అవకాశముందని పోలీసులు తమ కౌంటర్ ఫైల్లో పేర్కొన్నారు. ఈ కేసులో ఇంకా పలువురిని విచారించాల్సి ఉందని చెప్పారు. ఆయనకు సమాజంలో పలుకుబడి ఉందని, కేసులో బాధితురాలి వాంగ్మూలం రికార్డ్ చేయాల్సి ఉందని చెప్పారు.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS