Powerstar Pawan Kalyan was spotted wearing Jandhyam (the sacred thread which will be wore by Brahmins, Vyshyas and Kshatriyas).
త్రివిక్రమ్ సహవాసం పవన్ కల్యాణ్‌ను బాగానే ప్రభావితం చేసిందని చెప్పాలి. ఆలోచనల పరంగానే కాదు.. ఆధ్యాత్మికంగానూ ఈ ఇద్దరూ ఒకే బాటలో పయనిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. త్రివిక్రమ్ సాన్నిహిత్యంలో పవన్ దైవారాధనకు ఎక్కువ దగ్గరవడమే కాకుండా.. బ్రాహ్మణ ఆచార వ్యవహారాలపై కూడా మక్కువ కనబరుస్తున్నట్లు ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే పవన్ 'జంధ్యం' ధరించినట్లుగా ఓ వార్త తెర పైకి రావడం గమనార్హం.
అజ్ఞాతవాసి సినిమాలో ఆఫీస్ ఎపిసోడ్స్‌లో భాగంగా వచ్చే.. జనరల్ బాడీ మీటింగ్ సన్నివేశం ఈ 'జంధ్యం' ప్రచారానికి ఊతమిచ్చిందంటున్నారు. ఆ సన్నివేశంలో పవన్ టీషర్టులో కనిపిస్తారు. ఆ సమయంలో ఆయన షర్ట్ లోపల నుంచి జంధ్యం కొంచెంగా కనిపించిందంటున్నారు.
గతంలో గోపాల గోపాల సినిమా సమయంలోనూ పవన్ 'జంధ్యం' టాపిక్ వచ్చింది. ఆ సమయంలో ఆసుపత్రిలో ఉన్న తన అభిమాని ఒకరిని పలకరించడానికి పవన్ వెళ్లారు. ఆ సందర్భంగా బయటకొచ్చిన ఫోటోల్లో పవన్ ధరించిన కుర్తా లోపల 'జంధ్యం' స్పష్టంగా కనిపించింది. అప్పటినుంచే పవన్ జంధ్యం ధరిస్తున్నారేమో అన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.