జానీ మాస్టర్‌తో పవన్ సినిమా? కానీ ఓ ట్విస్ట్..!

Filmibeat Telugu 2018-01-23

Views 2

As per the current situations, Pawan Kalyan is no more doing films because of his political engagements. Jani Master met Pawan Kalyan recently and Pawan promised to produce the film on his home banner Pawan Kalyan Creative Works.'

పార్ట్ టైమ్ రాజకీయాలు చేస్తున్నాడన్న విమర్శలకు చెక్ పెట్టేందుకు జనసేన అధినేత పవన్ కల్యాణ్ పూర్తి స్థాయి రాజకీయాల్లోకి దిగాడు. రాజకీయాల్లో క్రియాశీలకంగా మారడంతో.. అందుకోసం సినిమాలను పణంగా పెట్టడం తప్పదని పరోక్షంగా చెప్పేశాడు. పవన్ నుంచి ఇక సినిమాలు రావన్న నిరాశలో అభిమానులు ఉన్నవేళ.. ఓ ఆసక్తికర ఊహాగానం తెరపైకి వచ్చింది..
కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్‌కు పవన్ కల్యాణ్ అంటే ఎంత ఇష్టమో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. తాను ఇండస్ట్రీలో కొరియోగ్రాఫర్‌గా నిలదొక్కుకోకమునుపే పవన్‌ను కలిసి ఓ కథ కూడా వినిపించారు. అయితే అనుభవలేమి కారణంగా జానీకి అప్పట్లో అవకాశం ఇవ్వలేదు పవన్ కల్యాణ్.
అప్పట్లో జానీకి అవకాశం ఇవ్వకపోయినా.. దర్శకత్వంపై పట్టు సంపాదించుకుని వస్తే కచ్చితంగా సినిమా చేస్తానని పవన్ మాట ఇచ్చారట. ఆ తర్వాతి కాలంలో ఇండస్ట్రీలో కొరియోగ్రాఫర్‌గా నిలదొక్కుకున్న జానీ మాస్టర్.. అదే సమయంలో దర్శకత్వ ప్రతిభకు మెరుగులు దిద్దుకున్నారట. అందుకే పవన్‌ను కలిసి ఇటీవలే మరోసారి సినిమా ప్రపోజల్ ఆయన ముందు పెట్టారట.
జానీకి ఇచ్చిన మాట మేరకు తప్పకుండా సినిమా చేస్తానని అన్నారట పవన్ కల్యాణ్. అయితే ఇందులో పవన్ కల్యాణే హీరోగా నటిస్తారా? అంటే దాదాపు అసాధ్యమే. దానికి తోడు ఇప్పటికే పలు నిర్మాణ సంస్థలతో పవన్ కమిట్ అయిన సినిమాలు కూడా ఉన్నాయి. వీటన్నింటిని పక్కనపెడితే.. కొండగట్టు యాత్రలో భాగంగా సినిమాల ఆలోచన లేదంటూ ఆయన ప్రకటించిన నేపథ్యంలో జానీతో సినిమా పట్టాలెక్కుతుందా? అన్న అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS