Santhosh Srinivas waiting for Pawan Kalyan is over. Pawan Kalyan told to Santhosh Srinivas do another movie
జనసేన పార్టీని బలోపేతం చేసే పనిలో పవన్ లీనమైపోయాడు. మరో సినిమా చేసే అవకాశం కూడా లేదు అంటూ పవన్ కళ్యాణ్ క్లారిటీ ఇచ్చాడు. కానీ పవన్ ప్రముఖుల నిర్మాణ సంస్థ మైత్రి మూవీస్ తో ఒప్పందం కుదుర్చుకున్నాడని ఆ ఒప్పదం ప్రకారం పవన్ కళ్యాణ్ మరో సినిమా చేసే అవకాశం ఉందంటూ వార్తలు వచ్చాయి. ఈ వార్తలపై అటు పవన్ శిబిరం నుంచి కానీ ఇటు మైత్రి మూవీస్ నుంచి కానీ ఎటువంటి క్లారిటీ లేదు. పవన్ కళ్యాణ్ తో సినిమా చేయడానికి సంతోష్ శ్రీనివాస్ ఎప్పటి నుంచో వేచిచూస్తున్నాడనే వార్తలు కూడా ఉన్నాయి.
అజ్ఞాతవాసి చిత్రం తరువాత పవన్ కళ్యాణ్ పూర్తిగా రాజకీయాలకు పరిమితం అయ్యారు. జనసేన పార్టీని బలోపేతం చేసే పనిలో బిజీగా ఉన్నారు. సంక్రాంతికి విడుదలైన అజ్ఞాతవాసి చిత్రం అభిమానులని నిరాశ పరిచిన సంగతి తెలిసిందే.