ముందస్తు ఎన్నికలు : పవన్ కల్యాణ్‌కు మోడీ సంకేతాలు

Oneindia Telugu 2018-01-26

Views 2K

BJP national president Amit Shah hinted early elections for Lok Sabha and few states. Pawan kalyan preparing for early elections

ప్రధాని నరేంద్ర మోడీ ముందస్తు ఎన్నికలకు వెళ్లే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. బిజెపి జాతీయాధ్యక్షుడు అమిత్ షా ఇచ్చిన ఒక ఇంటర్వ్యూ కూడా ఆ విషయాన్ని తెలియజేస్తోంది. కర్ణాటక ఫలితాలను బట్టి ముందస్తు ఎన్నికలకు వెళ్లే విషయంపై నిర్ణయం తీసుకుంటారని భావిస్తున్నారు. కర్ణాటక శాసనసభకు ఏప్రిల్‌లో ఎన్నికలు జరగనున్నాయి. లోకసభతో పాటు 8 రాష్ట్రాల శాసనసభలకు ఎన్నికలు నిర్వహించే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది.
తమ పార్టీకి దేశమంతా అనుకూల వాతావరణం ఉందని, ఎప్పుడు ఎన్నికలు జరిగినా తమ పార్టీ గతంలో కన్నా ఎక్కువ సీట్లు గెలుస్తుందని అమిత్ షా ఒక పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో అన్నారు.
లోకసభతో పాటు ఇతర రాష్ట్రాలకు ఎన్నికలు నిర్వహించాలని అనుకుంటున్నారా అని అడిగితే అటువంటిది ఏమైన ఉంటే మీకు చెబుతానని అనుకున్నారా అని అమిత్ షా ఎదురు ప్రశ్న వేశారు. కర్ణాటక శాసనసభ ఎన్నికల ఫలితాలను బట్టి మోడీ ప్రభుత్వం ముందస్తు ఎన్నికలపై నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని అంటున్నారు.
తెలంగాణలో తమ పార్టీ ప్రవేశించడానికి అవసమైన వెసులుబాట్లు లభిస్తున్నాయని అమిత్ షా అన్నారు. లోకసభ ఎన్నికలతో పాటు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, ఒడిశా, మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్‌గడ్, సిక్కిం, అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు కూడా నిర్వహించాలని ఆలోచన చేస్తున్నట్లు తెలుస్తోంది.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS