The Department of Andhra Pradesh is thinking to make a key decision regarding the "Tirupati Lord Venkateshwara Darsan"...AP Minister Manikyala Rao, says that the idea of Tirumala Venkanna is to visit only twice a year for Pilgrims convenience. The TTD is making arrangements to provide required laddus for devotees
తిరుపతి వెంకటేశ్వరుని దర్శనానికి సంబంధించి ఒక కీలక నిర్ణయం తీసుకునే విషయమై ఆంధ్రప్రదేశ్ దేవాదాయ శాఖ ఆలోచన చేస్తోంది. తిరుమల వెంకన్నను ఏటా రెండుసార్లు మాత్రమే దర్శించుకునేలా నియంత్రణ విధించే ఆలోచన చేస్తున్నట్లు దేవాదాయ మంత్రి పైడికొండల మాణిక్యాలరావు వెల్లడించడం కలకలం రేపుతోంది. బెంగుళూరులో ఓ తెలుగు మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన ఈ విషయాన్ని వెల్లడించారు. అయితే తాము ఎందుకు ఈ ఆలోచన చేస్తున్నామో మంత్రి మాణిక్యాలరావు వివరణ ఇచ్చారు. అయితే కారణాలు ఏమైనప్పటికి...ఈ ఆలోచన భక్తుల సౌకర్యార్థమే అయినప్పటికి...వారు ఈ నిర్ణయాన్ని ఎలా అర్ధం చేసుకుంటారు? ఎంతవరకు స్వాగతిస్తారనే సందేహాలు తలెత్తుతున్నాయి.
బెంగళూరులో ఎపి దేవాదాయ శాఖా మంత్రి పైడికొండల మాణిక్యాలరావు ఓ తెలుగు మీడియా సంస్థ ప్రతినిధితో మాట్లాడుతూ.."ప్రస్తుతం 70 వేల నుంచి 90 వేల మంది భక్తులకు మాత్రమే శ్రీవారి దర్శన భాగ్యం దక్కుతోంది. రోజూ సుమారు 30 వేల మంది భక్తులు దర్శనం చేసుకోకుండానే నిరాశతో వెనుదిరుగుతున్నారని...అన్ని రకాల దర్శనాలను ఆధార్‌తో అనుసంధానించి... ఏటా రెండుసార్లు మాత్రమే శ్రీవారి దర్శనానికి అనుమతించాలనే ఆలోచన ఉంది. రానున్న రోజుల్లో తిరుమల కొండపైకి భక్తులు ఎప్పుడు పడితే అప్పుడు రాకుండా... తమకు కేటాయించిన నిర్ణీత సమయంలోనే వెళ్లి శ్రీవారి దర్శనం చేసుకునేలా ఏర్పాటు చేయాలని కూడా భావిస్తున్నాం'' అని మంత్రి మాణిక్యాలరావు తెలిపారు.