ఎపికి కేంద్రం బ్యాడ్ న్యూస్ : విశాఖ రైల్వేజోన్‌ కి నో

Oneindia Telugu 2018-01-26

Views 1.1K

Minister of state for science and technology Y. Sujana Chowdary, citing a railway technical committee report, on Thursday said special railway zone for Andhra Pradesh headquartered at Visakhapatnam was not viable.

ఆంధ్రప్రదేశ్ లో రెండు ప్రధాన ప్రధాన ప్రాజెక్టులకు సంబంధించి ఎపి ప్రజల ఆశలపై కేంద్రం నీళ్లు చల్లింది. వాటిలో ఒకటి విశాఖ రైల్వే జోన్ సాధ్యపడని తేల్చి చెబుతుండగా...మరొకటి విభజన చట్టంలో పేర్కొన్న జాతీయ విపత్తు నిర్వహణ సంస్థ(ఎన్ఐడిఎం) మీ రాష్ట్రానికి ఇవ్వలేమనడం...వివరాల్లోకి వెళితే... విశాఖ రైల్వేజోన్‌ కు సంబంధించి ఈ ప్రాజెక్ట్ సాధ్యపడదని ఇప్పటివరకు వచ్చిన కమిటీ నివేదికలు చెప్పాయని కేంద్రమంత్రి సుజనా చౌదరి తెలిపారు. ఐతే, ఈ విషయంపై కేంద్రంపై ఒత్తిడి తెస్తున్నామని మంత్రి పేర్కొన్నారు. మరో వైపు వివిధ కారణాల రీత్యా ఎన్‌ఐడీఎం సంస్థను మీ రాష్ట్రంలో ఏర్పాటు చేయలేమని ఎపి ప్రభుత్వానికి కేంద్రం సమాచారం పంపినట్లు విశ్వసనీయ సమాచారం.
విశాఖ ప్రత్యేక రైల్వే జోన్ మనుగడ సాధ్యపడదని ఈ ప్రాజెక్టు విషయమై అధ్యయనం చేసిన రైల్వే టెక్నికల్ కమిటి నివేదిక తేల్చి చెప్పినట్లు కేంద్ర మంత్రి సుజనాచౌదరి తెలిపారు. విశాఖ రైల్వే జోన్ కి ఈ బడ్జెట్ ముందైనా మోక్షం కలిగే అవకాశం ఉందా?...అన్న ప్రశ్నకు ఆయన సమాధానం ఇస్తూ...బడ్జెట్ తో విశాఖ రైల్వే జోన్ కి సంబంధం లేదన్నారు. అయినా 99 శాతం జోన్ వస్తుందనే అశిస్తున్నామని, ఈ విషయమై కేంద్రంపై ఒత్తడి తీసుకువస్తున్నట్లు సుజనా చౌదరి వివరించారు.
కేంద్రం ఎపికి సంబంధించి మరో చట్టబద్ధమైన హామీని గంగలో కలిపేస్తున్నట్లు తాజా సమాచారం తేటతెల్లం చేస్తోంది. జాతీయ విపత్తు నిర్వహణ సంస్థ (ఎన్‌ఐడీఎం) దక్షిణాది ప్రధాన కార్యాలయాన్ని ఏపీలో ఏర్పాటు చేస్తామని విభజన చట్టంలో విస్పష్టంగా పేర్కొనగా...ఇప్పుడు వివిధ "ఇతరత్రా కారణాల"రీత్యా ఈ కేంద్రాన్నిమరో రాష్ట్రంలో ఏర్పాటు చేస్తామని కేంద్రం నుంచి అనధికార వర్తమానం వచ్చినట్లు విశ్వసనీయ సమాచారం.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS