Sujana Chowdary Argument with Arun Jaitley

Oneindia Telugu 2018-02-09

Views 310

TDP MP and Union Minister MP Sujana Chowdary, who is upset with Finance Minister Arun Jaitley's statement regarding Andhra Pradesh in the Parliament, has confronted with Jaitley

కేంద్ర ఆర్థికశాఖ మంత్రి అరుణ్‌జైట్లీతో మరో కేంద్ర మంత్రి సుజనా చౌదరి గురువారం సాయంత్రం వాగ్వాదానికి దిగారు. గురువారం నాడు పార్లమెంట్‌లో కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ ప్రసంగంపై ఆగ్రహంతో కేంద్ర మంత్రి సుజనా చౌదరి రాజ్యసభ లాబీల్లోనే వాగ్వావాదినికి దిగారు. ఏపీ ప్రజలకు తాము ముఖం చూపుకొనే పరిస్థితి లేకుండా చేశారని జైట్లీపై సుజనా చౌదరి ప్రశ్నించారు.
కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీ ఏపీ రాష్ట్రానికి వరాలు ప్రకటిస్తారని టిడిపి ఎంపీలు భావించారు. కానీ, ఎంపీల ఆశకు నిరాశే మిగిలింది. పాత ప్రసంగాన్నే జైట్లీ వల్లే వేశారని టిడిపి ఎంపీలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
నాలుగు రోజులుగా ఏపీకి చెందిన ఎంపీలు ఆందోళనలు నిర్వహిస్తున్నారు. కానీ, కేంద్రప్రభుత్వం నుండి సానుకూల సంకేతాలు లేవని టిడిపి ఎంపీలు అభిప్రాయపడుతున్నారు.
కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీతో మరో కేంద్ర మంత్రి సుజనాచౌదరి వాగ్వాదానికి దిగారు. లో‌క్‌సభలో జైట్లీ ప్రసంగం తర్వాత రాజ్యసభ లాబీల్లో జైట్లీతో సుజనాచౌదరి వాగ్వాదానికి దిగారు. ఏపీకి న్యాయం చేయకపోవడంపై సుజనా చౌదరి జైట్లీకి మరోసారి వివరించారు. ఏపీ ప్రజలకు ఇచ్చిన హమీలను నెరవేర్చాల్సిన అంశాన్ని సుజనా చౌదరి కేంద్ర ఆర్థిక మంత్రి జైట్లీ వద్ద ప్రస్తావించారు. దీంతో ఇద్దరి మధ్య కొద్దిసేపు వాగ్వావాదం చోటు చేసుకొంది.
ఏపీకి ఇచ్చిన హమీల విషయమై తాము ఇప్పటికే ఏపీకి సాయంపై ప్రకటన చేసినప్పటికీ ఎందుకు సంతృప్తి లేదని జైట్లీ కేంద్ర మంత్రి సుజనా చౌదరిని ప్రశ్నించారని సమాచారం. అయితే ఏపీకి న్యాయం జరగలేదని సుజనా చౌదరి బదులిచ్చారు. ప్రజలను ఎంత కాలం మోసం చేయలేమంటూ సుజనా అక్కడి నుంచి వెళ్లిపోయినట్లు తెలిసింది.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS