మెగా హీరోయిన్ నిహారిక నడిరోడ్డుపై ఏం చేసిందో తెలుసా?

Filmibeat Telugu 2018-01-31

Views 1.6K

Mega Heroine Niharika Konidela posted a butterfly video in twitter. Present she is acting in a tamil movie, which is almost ready to release.

సోషల్ మీడియా పుణ్యమాని సెలబ్రిటీలకు మరింత పబ్లిసిటీ దొరుకుతోంది. కేవలం సినిమాలే గాక.. అభిమానులను ఆకట్టుకోవడానికి తమదైన ట్వీట్స్ లేదా వీడియోలతో సోషల్ మీడియాలో టచ్ లోకి వస్తున్నారు. మెగా హీరోయిన్ నిహారిక కూడా సోషల్ మీడియాతో అభిమానులతో టచ్‌లో ఉంటోంది. తాజాగా ఆమె పోస్ట్ చేసిన ఓ వీడియో అభిమానులను విశేషంగా ఆకట్టుకుంటోంది..
చేతుల్లో బంధించిన సీతాకోకచిలుకను నడిరోడ్డుపై నిలబడి గాల్లోకి ఎగిరేస్తున్న ఓ వీడియోను నిహారిక తాజాగా ట్విట్టర్‌లో పోస్ట్ చేసింది. ఆ సీతాకోక చిలుక.. చేతుల్లో నుంచి అలా ఎగరగానే దాన్ని చూసి సంబరపడిపోయింది. ఇప్పుడీ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
ప్రస్తుతం నిహారిక తమిళంలో 'ఒరు నల్ల నాళ్‌ పాత్తు సొల్రేన్‌' అనే సినిమాలో నటిస్తోంది. షూటింగ్ గ్యాప్‌లో ఆటవిడుపు కోసం ఇలా సీతాకోకచిలుక వెంటపడ్డట్లుంది. వీడియోలో నిహారిక ఎక్స్‌ప్రెషన్స్ చూసి ఫ్యాన్స్ ఫిదా అయిపోతున్నారు.
కోలీవుడ్ టాప్ స్టార్ విజయ్ సేతుపతి- గౌతమ్ కార్తీక్ హీరోలుగా 'ఒరు నల్ల నాళ్‌ పాత్తు సొల్రేన్‌' స్ట్రయిట్ తమిళ సినిమా తెరకెక్కుతోంది. అయితే ఈ సినిమా తెలుగులో విడుదల కాకపోతుండటం మెగా అభిమానులను నిరాశపరుస్తోంది.
'ఒరు నల్ల నాళ్‌ పాత్తు సొల్రేన్‌'లో తన పాత్ర విభిన్నంగా ఉంటుందని నిహారిక చెబుతోంది. వేసవిలో సినిమా విడుదలకు ప్లాన్ చేస్తున్నారు.

Share This Video


Download

  
Report form