Budget 2018 : రేపే బడ్జెట్: అధిక నిధులు కావాలన్న హోంశాఖ

Oneindia Telugu 2018-01-31

Views 633

The Ministry of Home Affairs faces several challenges to provide safe and secure environment to the people of the country. Today, major challenges before us are insurgency, left wing extremism (LWE), cyber and information security issues, radicalisation, and ever-increasing frequency of natural and manmade disasters.

దేశ ఆంతరంగిక భద్రతతోపాటు సరిహద్దుల్లో సైన్యానికి బాసటగా నిలుస్తున్న హోంశాఖ ముందు పలు సవాళ్లు ఉన్నాయి. సీమాంతర ఉగ్రవాదం, మిలిటెన్సీ, మావోయిస్టులు, సైబర్ అండ్ ఇన్ఫర్మేషన్ సెక్యూరిటీ సమస్యలు, అతివాదంతోపాటు ప్రక్రుతి వైపరీత్యాల నుంచి ప్రజల రక్షణకు చర్యలు చేపట్టాల్సి ఉన్నది. ఈ క్రమంలో హోంశాఖ సిబ్బందికి ఎప్పటికప్పుడు తర్ఫీదునిస్తూనే మరోవైపు నిరంతరం వారి సంక్షేమానికి చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత ఉన్నది. అంతే కాదు టెక్నాలజీ అందుబాటులోకి వచ్చిన తర్వాత దాని వినియోగంపైనా శిక్షణ ఇవ్వడం.. సంప్రదాయ పద్దతుల్లో పోలీసుశాఖ విధుల నిర్వహణ కష్టతరంగా.. అసలు ఒక సవాల్‌గా, ప్రియంగా మారిందంటే అతిశయోక్తి కాదు. పోలీసు శాఖ ఆధునీకరణ, సైబర్ భద్రత, సున్నితమైన సమాచార డేటా తదితర అంశాలతోపాటు శాంతిబద్రతల పరిరక్షణ విధుల నిర్వహణకు నిధులతోపాటు ఎప్పటికప్పుడు సిబ్బంది నియామకం కీలకం అని హోంశాఖ చెబుతోంది. సమగ్ర చెక్ పోస్టులను ఏర్పాటు చేయడంతోపాటు సరిహద్దుల్లో వాణిజ్యం విస్తరణ, పొరుగు దేశాలతో ఆర్థిక సంబంధాల బలోపేతానికి అవకాశాలు ఉన్నాయి. ప్రత్యేకించి వామపక్ష తీవ్రవాదాన్ని నియంత్రించడానికి బహుళ అంచెల వ్యూహాన్ని అమలు చేయాల్సిన అవసరం ఉన్నది. అందునా సామాజిక పెట్టుబడులతోపాటు ఆర్థిక మౌలిక వసతులు కల్పించాల్సిన అవసరం ఉన్నది.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS