Condemning the political crimes and assassinations that took place in Karnataka in the past, Prime Minister Narendra Modi on Sunday said the state’s Congress Government is focusing on ‘ease of doing crime.’
కర్ణాటక రాజదాని బెంగళూరుకు వచ్చిన ప్రధాని నరేంద్ర మోడీ కాంగ్రెస్ ప్రభుత్వం మీద నిప్పులు చెరిగారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్న ప్రతి రాష్ట్రంలో రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. భారత దేశంలో కాంగ్రెస్ ప్రభుత్వం లేకపోయిన సమయంలోనే మనం ప్రశాంతంగా జీవిస్తామని ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు.
ప్రియ బంధువులారా మీకు నమస్కారం, బెంగళూరు నిర్మాత కెంపేగౌడ, కిత్తూరు రాణిచెన్నమ్మ, సర్ ఎం. విశ్వేశ్వరయ్య లాంటి మహానుభావులు పుట్టిన ఈ భూమి మీద మాట్లాడటం నాకు చాల సంతోషంగా, గర్వంగా ఉందని ప్రధాని నరేంద్ర మోడీ స్వచ్చమైన కన్నడలో మాట్లాడి కన్నడిగులను ఆకట్టుకున్నారు.
బెంగళూరులో ఇంత వరకూ ఏ ప్రభుత్వం ఇవ్వనటువంటి సబ్ అర్బన్ రైల్వే ప్రాజెక్ట్ కు రూ. 17 వేల కోట్లు కేటాయించామని ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు. బెంగళూరులో 160 కిలోమీటర్ల దూరం సబ్ అర్బన్ రైలు సంచరించడానికి కేంద్ర ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుందని ప్రధాని మోడీ అన్నారు.
కర్ణాటకలో సిద్దరామయ్య ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత 3,500 మందికి పైగా రైతులు ఆత్మహత్య చేసుకున్నారని మాజీ ముఖ్యమంత్రి బీఎస్. యడ్యూరప్ప ఆరోపించారు. 24 మంది హిందూ కార్యకర్తలను దారుణంగా హత్య చేసినా సిద్దరామయ్య ప్రభుత్వం దేశద్రోహులతో చేతులు కలిపిందని ఆరోపించారు.