Imsai Arasan 23am Pulikecei was a landmark film in actor Vadivelu's film career. Last year, it was announced that there will be a sequel to Imsai Arasan 23am Pulikecei titled Imsai Arasan 24am Pulikecei, produced by director Shankar. The film was put on hold when Vadivelu did not cooperate and stopped turning up for the shoot.
ప్రముఖ హాస్యనటుడు వడివేలు సినీ కెరీర్‌లో హింసించే 23వ రాజు పులకేసి మైలురాయిగా నిలిచింది. ఆ చిత్రానికి సెన్సేషనల్ డైరెక్టర్ శంకర్ నిర్మాతగా వ్యవహరించిన సంగతి తెలిసిందే. ఆ చిత్రం తర్వాత హింసించే 24వ పులకేసి రూపొందించింది. ఈ చిత్రం షూటింగ్ విషయంలో తమను ఇబ్బందికి గురిచేశాడని నిర్మాతలు పోలీసులకు ఫిర్యాదు చేయడం తమిళ చిత్ర పరిశ్రమలో చర్చనీయాంశమైంది
గతేడాది 23వ రాజు పులకేసి చిత్రానికి సీక్వెల్‌గా హింసించే 24వ రాజు పులకేసి ప్రారంభించారు. ఆ చిత్రానికి కూడా దర్శకుడు శంకర్ నిర్మాతగా వ్యవహరించారు. వడివేలు సహకరించకపోవడంతో ఆ సినిమా ఆగిపోయింది.
హింసించే 24వ రాజు పులకేసి చిత్రాన్ని పూర్తి చేయడానికి సహకరించాలని వడివేలును కోరారు. పలుమార్లు కోరిన పిదప కూడా ఫలితం లేకపోయింది. ఆ నేపథ్యంలో వడివేలుపై చర్యలు తీసుకోవడానికి నిర్మాతలు పోలీసులకు ఫిర్యాదు చేశారు.
పోలీసులను సంప్రదించడానికి ముందు తమిళనాడు నిర్మాతల మండలిలో పులకేసి నిర్మాతలు ఫిర్యాదు చేశారు. పలుమార్లు ఫిర్యాదు చేసినా గానీ ఎలాంటి స్పందన లేకపోవడంతో పోలీసులను ఆశ్రయించినట్టు సమాచారం.
ఈ చిత్రంలో వడివేలుకు పనిచేసే స్టైలిష్ట్ విషయంపై వివాదం నెలకొన్నది. తనకు నచ్చిన స్టైలిస్ట్‌ను ఇవ్వాలని, లేదా తెచ్చుకొంటానని సూచించడంతో నిర్మాతలు నిరాకరించారు. దాంతో నిర్మాతలకు, వడివేలుకు మధ్య రిలేషన్లు చెడిపోయాయి.